HomeLATEST6000 కేంద్ర ఉద్యోగాలు.. ఇప్పటినుంచే ప్రిపేర్​ కావాలి​

6000 కేంద్ర ఉద్యోగాలు.. ఇప్పటినుంచే ప్రిపేర్​ కావాలి​

కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‍డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) పోస్టల్‍/సార్టింగ్ అసిస్టెంట్‍, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) వంటి పోస్టుల భర్తీకి ఏటా నిర్వహించే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. గత రెండేళ్లలో యావరేజ్ గా 5800 పోస్టులు విడుదల చేసిన ఎస్ఎస్‌సీ ఈ సారి కూడా దాదాపు 6 వేల ఖాళీలు ప్రకటించే అవకాశం ఉంది. సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్, టిప్స్ మీ కోసం..

Advertisement

సీజీఎల్ తర్వాత అతి ఎక్కువ మంది రాసే పరీక్ష సీహెచ్‍ఎస్‍ఎల్‍. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పోటీ పడతారు. సిలబస్ కూడా విస్తృతంగా ఉంటుంది. ప్లాన్డ్‌గా ప్రిపేరయితే ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిర జాబ్‌లో ఎంటరయ్యే అవకాశం కల్పిస్తోంది సీహెచ్‌ఎస్‌ఎల్. పే లెవెల్-2, 4 కింద వేతనాలు అందిస్తారు. ప్రారంభంలో ఎల్‌డీసీ, జేఎస్ఏ కి అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపు 30 వేల సాలరీ లభిస్తుంది. పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కి 35 వేలకు పైగా వేతనాలు అందుతాయి.

పోస్టులు:
1) లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్ (ఎల్‌డీసీ)/ జూనియ‌ర్ సెక్రటేరియ‌ట్ అసిస్టెంట్
2) పోస్టల్ అసిస్టెంట్‌/ సార్టింగ్ అసిస్టెంట్
3) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌‌.

సెలెక్షన్ ప్రాసెస్
టైర్-1, 2, 3 అనే మూడు దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొదటిదశలో దేశవ్యాప్తంగా మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. డ్యురేషన్ 60 నిమిషాలు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.50 మార్కు నెగెటివ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీలో ముద్రిస్తారు. టైర్- I లో మెరిట్ సాధించిన వారిని టైర్-II లో నిర్వహించే డిస్ర్కిప్టివ్ టెస్ట్‌కు సెలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా ఎంపికైతే చివరిదశలో నిర్వహించే స్కిల్‍టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు రాయాల్సి ఉంటుంది.

Advertisement

ఎగ్జామ్​ ప్యాటర్న్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు

ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 50
జనరల్ ఇంటెలిజెన్స్ 25 50
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 50
జనరల్ అవేర్‌నెస్ 25 50
మొత్తం 100 200

పెన్​ అండ్​ పేపర్​ టెస్ట్​: ఈ పేపర్లో 100 మార్కులకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. టెస్ట్ డ్యురేషన్ 60 నిమిషాలు. ఇందులో 200 నుంచి 250 పదాలతో ఎస్సే రైటింగ్, 150 నుంచి 200 పదాలతో లెటర్ రైటింగ్ రాయాలి. ఈ ప్రశ్నలకు పూర్తిగా ఇంగ్లిష్/హిందీలోనే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఎస్సే రైటింగ్‌లో టైటిల్, ఇంట్రడక్షన్, మెసేజ్ ఆఫ్ ద ఎస్సే, కన్‌క్లూజన్ వంటి అంశాలు ఆర్డర్‌లో రాయాలి. లెటర్ రైటింగ్‌లో అడ్రస్, డేట్, డెస్టినేషన్ నేమ్ అండ్ అడ్రస్, రెఫరెన్స్, శాల్యుటేషన్, సబ్జెక్టు, బాడీ, ఎండింగ్, సిగ్నేచర్, పేరు తదితర అంశాల ఆధారంగా మార్కులిస్తారు. ఇందుకుగాను కొన్ని నమూనా లెటర్స్ ప్రాక్టీస్ చేస్తే సులువుగా క్వాలిఫై అయ్యే టెస్ట్ ఇది.

స్కిల్ టెస్ట్
కాగ్ కార్యాలయాల్లో తప్ప అన్ని ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. గంటకు 8 వేల కీ డిప్రెషన్‌ల స్పీడ్‌తో టైప్ చేయగలగాలి. టెస్ట్ డ్యురేషన్ 15 నిమిషాలు. 2 వేల నుంచి 2200 కీ డిప్రెషన్స్ కలిగిన ఇంగ్లిష్ కంటెంట్‌ను టైప్ చేయాల్సి ఉంటుంది. కాగ్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ కు గంటకు 15 వేల కీ డిప్రెషన్స్ తో ఎంట్రీ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కు టైపింగ్ టెస్ట్ ఇంగ్లిష్‌లో ఉండగా మిగిలిన అన్ని పోస్టులకు ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. డ్యురేషన్ 10 నిమిషాలు. ఇంగ్లిష్ అయితే నిమిషానికి 35 పదాలు, హిందీకి నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి. నిమిషానికి 30 పదాలు అంటే గంటకు 9వేల కీ డిప్రెషన్స్ అన్నమాట.

Advertisement

నోటిఫికేషన్​

అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టులతో ఇంట‌ర్మీడియ‌ట్ఉత్తీర్ణత‌.
వయసు: 1 జనవరి 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్​ ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరి తేది: 7 మార్చి
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 8 మార్చి
కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష (టైర్‌-1): 2022, మే.
వెబ్​సైట్​: www.ssc.nic.in

సిలబస్ అండ్ టిప్స్
షిఫ్టుల వారీగా నిర్వహించే పరీక్ష కాబట్టి అభ్యర్థులు ముందు రోజు రాసిన వారికి క్వశ్చన్స్ ఎలా అడిగారో తెలుసుకొని దాని ప్రకారం సిద్ధమైతే మంచి స్కోర్ పొందొచ్చు. ఎందుకంటే అన్ని షిప్టుల పేపర్లు బ్యాలెన్స్‌డ్‌గా, ఈక్వల్ ప్యాటర్న్, స్టాండార్డ్స్‌తో తయారు చేస్తారు కాబట్టి ముందు షిఫ్టుల్లో అడిగిన ప్రశ్నలకు రిలేటెడ్ ఏరియాస్ ను బాగా రివిజన్ చేయాలి. ప్రశ్నలన్నీ ఇంటర్ స్టాండార్డ్‌లో కన్‌ఫ్యూజన్ లేకుండా నేరుగానే ఇస్తారు.

Advertisement

ఇంగ్లిష్ లాంగ్వేజ్
స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సిననిమ్స్, హోమోనిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్స్/మిస్‌స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్సన్ ప్యాసేజ్ నుంచి ప్రశ్నలిస్తారు. ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ చేయాలంటే సీజీఎల్, సీహఎచ్ఎస్‌ఎల్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్ వంటి ఇతర ఎస్సెస్సీ పరీక్షల్లోని ప్రీవియస్ పేపర్లలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారో గమనించి ప్రిపేరవ్వాలి. ఎందుకంటే రిలేటెడ్, రిపీటెడ్ ప్రశ్నలు ఎక్కువ ఇచ్చేందుకు అవకాశం ఉన్న సెక్షన్ కాబట్టి ఆ మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ ఇంటెలిజెన్స్
ఇందులో వర్బల్ అండ్ నాన్ వర్బల్ సెక్షన్ల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్యమైన టాపిక్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్, సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ అండ్ నంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ అనాలజీ అండ్ క్లాసిఫికేషన్, స్పేస్ ఓరియంటేషన్, సెమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రమ్స్, సింబాలిక్ అండ్ నంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్‌ఫెరెన్సెస్, పంచ్డ్‌హోల్ / ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్‌ఫోల్డింగ్, సెమాంటిక్ సిరీస్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆపరేషన్స్, ఇతర సబ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. రీజనింగ్‌లో లాజిక్‌గా ఆలోచించి సమాధానాలు రాసే ప్రశ్నలే అధికంగా ఉంటాయి. ఇందుకు ప్రత్యేకంగా పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ తెలిస్తే చాలు కేవలం ప్రాక్టీస్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లను ఎక్స్‌ప్లనేషన్స్‌తో సహా ప్రిపేరయితే ఏ టాపిక్‌లో ఏ మోడల్ కు ఎలా సమాధానం రాయాలో అవగాహన వస్తుంది. సీజీఎల్, సీహెచ్‌ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి ఇతర పరీక్షలను ఆన్‌లైన్‌లో షిఫ్టుల వారీగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కువ సెట్స్ పేపర్స్ లభిస్తాయి. వీటన్నింటిని తప్పనిసరిగా సాల్వ్ చేస్తూ సాధన చేయాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
నంబర్ సిస్టమ్స్‌లో హోల్ నంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్ అనే అంశాలున్నాయి. ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్‌లో శాతాలు, రేషియో, ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభనష్టాలు, డిస్కౌంట్స్, భాగస్వామ్యం, మిక్సర్ అండ్ అలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనే సబ్ టాపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మెన్సురేషన్ చాప్టర్‌లో ట్రయాంగిల్స్, క్వాడ్రాలేటరల్స్, రెగ్యులర్ పాలిగాన్స్, సైకిల్, రైట్ ప్రిజమ్, రైట్ సర్క్యూలర్ కోన్, సిలిండర్, స్పియర్, హెమీస్పియర్, రెక్టాంగిల్ వంటి ముఖ్యమైన సబ్ టాపిక్స్ చదువుకోవాలి.

Advertisement

ఈ సెక్షన్‌లో ఫార్ములాతో సాల్వ్ చేస్తేనే సమాధానం వచ్చేలా ప్రశ్నలిస్తారు. కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ప్రాక్టీస్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో అన్ని టాపిక్స్‌లో మోడల్స్ ఫార్ములాల ఆధారంగా చదవాలి. ఖచ్చితంగా బార్ గ్రాఫ్/పై చార్ట్/లైన్ గ్రాఫ్/టేబుల్స్ పై 5 మార్కులకు క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలోని డేటా అనలైజ్ చేయగలిగితే ఐదు మార్కులు మీ సొంతం.

జనరల్ అవేర్‌నెస్
అభ్యర్థి తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశీలించి దానిని సొసైటీకి ఎలా అప్లై చేస్తున్నాడో, దాని నుంచి ఏమి నేర్చుకున్నాడో పరీక్షించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఉదాహరణకు నిత్యం వాడే వంట గ్యాస్ సిలిండర్ లో సమ్మేళనం ఏంటి అని అడగవచ్చు. షేవింగ్ తర్వాత రాసే రసాయనం మంటగా, వెంటనే కూల్‌గా అనిపించడానికి గల కారణం? బంగారు ఆభరణాల్లో కలిపే మరో లోహం ఏది? నిత్యం వాడే మొబైల్, కంప్యూటర్ టెక్నాలజీ, డైలీ యూజ్ చేసే బ్యాంకింగ్ ఆపరేషన్స్, మానవులకు వచ్చే వ్యాధులు-కారణాలు, రోజూ ట్రావెల్ చేసే ట్రాన్స్‌పోర్ట్ మార్గాల్లో హైవేలు, రైళ్ల విశేషాలు, నదులు, సముద్రాలు వంటి అంశాలు, మనకు రోజూ ఎదురయ్యే సంఘటనల్లోని ప్రాధాన్యత కలిగిన అంశాల నుంచే ప్రశ్నలిస్తారు. అలాగే కరెంట్ అఫైర్స్, పొరుగుదేశాలతో భారత సత్సంబంధాలు, వివాదాలపై క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్, కంప్యూటర్​ బేసిక్స్​ నుంచి ప్రశ్నలిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!