HomeLATESTటీఎస్​ టెట్​కు ఇలా అప్లై చేయండి: లేట్​ చేస్తే.. పక్క జిల్లాల్లో సెంటర్​

టీఎస్​ టెట్​కు ఇలా అప్లై చేయండి: లేట్​ చేస్తే.. పక్క జిల్లాల్లో సెంటర్​

టెట్​(టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​) TSTET వెబ్​సైట్​ అందుబాటులోకి వచ్చింది. మార్చి 26 (ఈ రోజు) నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అభ్యర్థులు https://tstet.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి ముందుగా ఫీజు చెల్లించి తర్వాత అప్లికేషన్​లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు లేటెస్ట్ ఫొటో గ్రాఫ్ స్కానింగ్ ఇమేజ్, సిగ్నేచర్ స్కాన్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీరు ఫోన్​ నంబర్​ ఎవరిదో కాకుండా మీకు అందుబాటులో ఉండేది ఎంట్రీ చేస్తే టెట్​ సంబంధించి మెసేజ్​లను ఎప్పటికప్పుడు రిసీవ్​ చేసుకోవచ్చు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేస్తే ప్రిపరేషన్​ టైమ్​లో ఎలాంటి ఆందోళన ఉండదు. టెన్త్ మెమోలో ఉన్న విధంగా పేరు, ఇతర వివరాలు అప్​లోడ్​ చేయాలి.

Step 1: అభ్యర్థులు మొదటగా http://tstet.cgg.gov.in/ ఓపెన్​ చేసి పేపర్​–1 లేదా పేపర్​–2 ఎవరైనా రూ. 300 అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Step 2: ఫీజు చెల్లించేందుకు అభ్యర్థి పేరు, పుట్టినతేది, మొబైల్​ నం. , తెలంగాణ రాష్ట్రానికి చెందినవారా కాదా? అనేది ఎంట్రీ చేసి సబ్మిట్​ చేస్తే బిల్​డెస్క్​ ఓపెన్​ అవుతుంది. తర్వాత, డెబిట్​, క్రెడిట్​,నెట్​బ్యాంకింగ్​ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

Step3: ఫీజు చెల్లించిన అనంతరం అభ్యర్థులకు జర్నల్ నంబర్ కేటాయించబడుతుంది. ఈ నంబర్ ను అప్లికేషన్ ఫామ్ నింపడానికి తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

Step 4: ఫీజు చెల్లింపు సంబంధించిన జర్నల్​ నంబర్​ , పుట్టిన తేది, ఫీజు చెల్లించిన తేది వివరాలు నమోదు చేసిన తర్వాత అప్లికేషన్​ ఫాం ఓపెన్​ అవుతుంది.

Step 5: అప్లికేషన్​ ఫారం ఓపెన్​ అయిన తర్వాత అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేయాలి. .

Step 6: తర్వాత Save&Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 7: తర్వాత Paper and Qualification విభాగంలో కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేయాలి. తర్వాత Save & Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 8: అనంతరం టెన్త్​ క్లాస్​, ప్రీవియస్​ టెట్​ డీటెయిల్స్​ ఎంట్రీ చేయాలి.

Step 9: తర్వాత “Save & Preview” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 10: ప్రివ్యూలో వివరాలను సరిచూసుకుని సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 11: తర్వాత క్యాండిడేట్​ ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీ మీ రిజిస్టర్డ్ నంబర్ కు SMS ద్వారా వస్తుంది.

Step 12: అనంతరం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని అభ్యర్థి ఎగ్జామ్​ రాసి రిజల్ట్​ వచ్చేంత వరకు భద్రపరుచుకోవాలి.

హెల్ప్​లైన్​

అభ్యర్థులు అప్లికేషన్ నింపే విషయంలో ఏమైనా సందేహాలుంటే ఈ నెల 26 నుంచి జూన్ 12 వరకు –8121010310, 8121010410 నంబర్లను సంప్రదించవచ్చు. టెక్నికల్ సమస్యలు ఉంటే.. 040-23120340, 040- 23120433 నంబర్లను సంప్రదించవచ్చు. టెట్ కు సంబంధించి ఇతర ఏమైనా సందేహాలుంటే 8341371079, 8341831080 నంబర్లను సంప్రదింవచ్చు. అభ్యర్థులు జూన్ 6 నుంచి అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు అప్లికేషన్​ చివరితేది వరకు అప్లై చేయకుండా ఆలస్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు చివరి సమయంలో టెక్నికల్​ సమస్యలు తలెత్తి వెబ్​సైట్​ ఓపెన్​ కాకపోవచ్చు. అంతే కాకుండా లేట్​గా అప్లై చేస్తే మీ సొంత జిల్లాలో సెంటర్లు నిండిపోయి పక్క జిల్లాలు లేదా హైదరాబాద్​లో సెంటర్​ కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేయడం మేలు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here