HomeLATESTగ్రూప్​ వన్​ అప్లికేషన్లు నేటి నుంచే.. అభ్యర్థులు ఏమేం చేయాలి

గ్రూప్​ వన్​ అప్లికేషన్లు నేటి నుంచే.. అభ్యర్థులు ఏమేం చేయాలి

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 అప్లై చేయాలంటే అభ్యర్థులందరూ ముందుగా వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ (OTR) చేసుకోవాలి. టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులందరూ వన్​ టైమ్ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. గతంలో రిజిస్ట్రేషన్​ చేసుకున్న అభ్యర్థులు తమ ఓటీఆర్​ను తప్పనిసరిగా అప్​డేట్ ​ చేసుకోవాలి. ఓటీఆర్ లేకుంటే అప్లికేషన్​ చేయటం కుదరదు. పాత ఓటీఆర్​ ఉన్న వాళ్లు​ అప్ డేట్​ చేసుకున్నవాళ్లే గ్రూప్​ 1కు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. అభ్యర్థులు ఓటీఆర్​లో తమ మొబైల్​ ఫోన్​ నెంబర్లు, మెయిల్​ఐడీలు సరిచూసుకోవాలి.

గ్రూప్​ 1​ అప్లికేషన్లు ఈ రోజు నుంచి (మే 2 నుంచి) ప్రారంభమవుతాయి. మే 31వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకునే లాగిన్​ ఆఫ్షన్​ అందుబాటులో ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తు ఫారమ్‌ను ఎలా అప్‌లోడ్ చేయాలి:

స్టెప్​ 1:

అభ్యర్థులందరూ ముందుగా టీఎస్​పీఎస్​సీ ద్వారా ఓటీఆర్​ నమోదు చేసుకోవాలి. పాత ఓటీఆర్​ ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్​ డేట్ చేసుకోవాలి.

  • పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఓటీఆర్ రిజిస్ట్రర్​ చేసుకున్న అభ్యర్థులు TSPSC ID మరియు Date of Birth ఎంటర్​ చేసి తమ ప్రోఫైల్ కు లాగిన్​ కావాలి.
  • అభ్యర్థులు TSPSC ID మరిచిపోతే.. టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో “Know Your TSPSC_ID” లింక్​పై క్లిక్​ చేయాలి. తమ ఆధార్​ కార్డ్ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్ ఎంటర్​ చేసి.. టీఎస్​పీఎస్​సీ ఐడీ పొందవచ్చు. వీలుంది.
  • రిజిస్టేషన్​ చేసేటప్పుడు, పోస్టులకు అప్లై చేసేటప్పుడు.. అభ్యర్థులందరూ తమ
    ఆధార్​కార్డు,
    విద్యార్హతల సర్టిఫికెట్లు (ఎస్​ఎస్​సీ నుంచి డిగ్రీ.. వరకు),
    స్డడీ/బోనఫైడ్​ లేదా నివాస ధ్రువీకరణ పత్రం(రెసిడెన్స్​ సర్టిఫికెట్​,
    కమ్యూనిటీ(క్యాస్ట్) సర్టిఫికెట్​,
    ఈడబ్ల్యుఎస్​,
    స్పోర్ట్స్​,
    పీహెచ్​ సర్టిఫికెట్

    వీటికి సంబంధించిన సాప్ట్ కాపీలు.. అప్​లోడ్​ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచుకోవాలి.


స్టెప్​ 2:

a) వెబ్‌సైట్‌లో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి, TSPSC ID మరియు పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్​ కావాలి.

b) లాగిన్​ కాగానే OTR డేటాబేస్ నుండి అభ్యర్థికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి.
(పుట్టిన తేదీ, విద్యార్హతలు, జెండర్​, క్యాస్ట్, పీహెచ్​, స్పోర్ట్, ఎక్స్​ సర్వీస్​మేన్​ కోటా)

c) ఓటీఆర్​ డేటాబేస్​ ఆధారంగా వచ్చిన వివరాలన్నీ సరిగ్గా ఉంటే.. YES బటన్​ క్లిక్​ చేయలి. అక్కడున్న వివరాలు సరిగా లేకపోతే.. మార్చాల్సిన అవసరం ఉన్నట్లయితే, NO పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీఆర్​ ఫామ్​ ఓపెన్​ అవుతుంది. అందులో కావాల్సిన మార్పులు చేసుకొని సబ్​మిట్​ బటన్​ క్లిక్​ చేయాలి.

d) OTR డేటాబేస్ నుండి పొందిన వివరాలతో పాటు, నోటిఫికేషన్ లో నమోదు చేయాల్సిన వివరాలన్నీ అభ్యర్థులే జాగ్రత్తగా నింపాలి. ఎగ్జామ్​ సెంటర్ ఎంపిక, అవసరమైన అర్హతలు ఎంటర్​ చేయటంతో పాటు డిక్లరేషన్‌లు ఓకే చేయాలి.

e) అప్లికేషన్​ ఫిల్​ చేసిన తర్వాత ప్రివ్యూ మరియు ఎడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా మరోసారి చెక్​ చేసుకొని.. SAVE& CONFIRM బటన్​ క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితే ఆన్​లైన్​ లో ఫీజు చెల్లించే గేట్​ వే ఓపెన్​ అవుతుంది.

స్టెప్ 3:

అభ్యర్థులు నిర్ణీత ఎగ్జామ్​ ఫీజును ఆన్​లైన్​లోనే చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, T-Wallet ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

స్టెప్ 4: ఫీజు చెల్లించిన తర్వాత, అప్లికేషన్​ PDF జనరేట్​ అవుతుంది. అభ్యర్థులు ఈ పీడీఎఫ్​ ను తప్పనిసరిగా డౌన్​లోడ్​ చేసుకోవాలి. పీడీఎఫ్​లోని రిఫరెన్స్ ID నంబర్ తదుపరి కరస్పాండెన్స్​కు ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఉండాలి

అభ్యర్థులు అన్ని వివరాలు పూర్తి చేయాలి. అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!