గ్రూప్–1, గ్రూప్–2, ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్‌తో పాటు రూ.5వేల స్టైఫెండ్ కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు షెడ్యూల్ విడుదలైంది.
ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 16న ఆన్లైన్, ఆఫ్లైన్విధానంలో ఉదయం 11 గంటల నుంచి 12.30 వరకు ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. ఎంపికైన వారు గ్రూపు–1 పోస్టుకు శిక్షణ పొందితే 6నెలల పాటు రూ.5 వేలు, గ్రూప్ 2 మరియు ఎస్సై అభ్యర్థులకు 3 నెలల పాటు ప్రతి నెల 2 వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసేకునేందుకు ఏప్రిల్ 16 ఉదయం 10గంటల వరకు అవకాశం కల్పించారు.
ఆసక్తి గల నిరుద్యోగులు ఈ క్రింది లింకు ద్వారా
https/studycircle.cgg.gov.in
https:/mjpabcwreis.cgg gov.in ద్వారా ఆన్లైన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగలరు.
ప్రవేశ పరీక్షను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లతోపాటు మొబైల్ ఫోన్ల ద్వారా రాయవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా పరీక్ష రాసే అభ్యర్థులు అందుబాటులో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలి.
BC STUDY CIRCLE
Usefull
Its useful to me