తెలంగాణ లోని అన్ని విద్యా సంస్థల కు ఈ నెల 30 వరకు సెలవులను పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా ముందుగా ఈ నెల 16 వరకు సెలవులను ప్రకటించటం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండటంతొ సెలవుల ను పాడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది.
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… కరోనా తదితర విషయాలమీద కేబినేట్ లో చర్చించనున్నారు.