గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై కీలక తీర్పు వెలువడింది. మహిళల రిజర్వేషన్లు 33 శాతం మించకూడదని స్పష్టం చేసింది. గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పును ఆధారంగా జడ్టిమెంట్ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో మహిళల కోటా 33 శాతం మించకూడదని.. అందుకు అనుగుణంగా హారిజంటల్ రిజర్వేషన్ల నియమాన్ని పాటించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ నెల 14న ఈ తీర్పు కాపీ గురువారం టీఎస్పీఎస్సీకి అందింది. దీని ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను త్వరలోనే విడుదల చేసే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. కోర్టు తీర్పు కాపీ.. ఇక్కడ యథాతథంగా అందుబాటులో ఉంది.