ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పైనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
ఖాళీలు: మొత్తం 200 ఖాళీల్లో కానిస్టేబుల్ (కార్పెంటర్) (పురుషులు): 61, కానిస్టేబుల్ (కార్పెంటర్) (మహిళలు): 10, కానిస్టేబుల్ (ప్లంబర్) (పురుషులు): 44, కానిస్టేబుల్ (ప్లంబర్) (మహిళలు): 8, కానిస్టేబుల్ (మేసన్) (పురుషులు): 54, కానిస్టేబుల్ (మేసన్) (మహిళలు): 10, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (పురుషులు): 14, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (మహిళలు): 1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ (మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్) ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700 నుంచి -రూ.69,100 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆబ్జెక్టి్వ్ టైప్ పద్ధతిలో పదో తరగతి సిలబస్ ఆధారంగా 100 ప్రశ్నలు (100 మార్కులు) అడుగుతారు. జనరల్ ఇంగ్లీష్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ హిందీ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), సింపుల్ రీజనింగ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు).
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.recruitment.itbpolice.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.