ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), హైదరాబాద్‌లోని ఏవియానిక్స్ విభాగంలో 132 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ , జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు జూన్ 2 నుంచి జూన్ 5 వరకు నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
HAL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026:
ఖాళీల వివరాలు:
మొత్తం 132 పోస్టులను మూడు వర్గాలుగా విభజించారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 68 పోస్టులు (ECE, Mechanical, EEE, Civil, CSE, Aeronautical).
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 30 పోస్టులు (ECE, Mechanical, EEE, Civil, CSE).
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 34 పోస్టులు (B.Com, B.Sc Electronics/Chemistry/Computers/Nursing).
అర్హతలు:
1.సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2.అభ్యర్థులు తమ కోర్సును పూర్తి చేసి 5 ఏళ్లు మించకూడదు.
- ఇప్పటికే ఎక్కడైనా అప్రెంటిస్ శిక్షణ పొందిన వారు లేదా ప్రస్తుతం చేస్తున్న వారు అనర్హులు.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్ 30న మెరిట్ లిస్ట్ విడుదల చేసి.. జూలై 27 నుంచి ట్రైనింగ్ ప్రారంభిస్తారు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ (ఉదయం 9:00 గంటలకు)..
జూన్ 02: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (ECE, Civil, Aeronautical).
జూన్ 03: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (EEE, CSE, Mechanical).
జూన్ 04: జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్ (B.Com, B.Sc).
జూన్ 05: డిప్లొమా టెక్నీషియన్స్ (అన్ని విభాగాలు).
వేదిక:
ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ వెనుక, HAL ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ – 500042.
ముఖ్య గమనిక:
అభ్యర్థులు హాజరయ్యే ముందు తప్పనిసరిగా NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫోటోకాపీలను వెంట తీసుకెళ్లాలి.





