ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం. ప్రముఖ డిఫెన్స్ కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), నాసిక్ నుంచి గ్రాడ్యుయేట్, డిప్లొమా, బిటెక్ అభ్యర్థుల కోసం భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 627 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. నెలవారీ స్టైఫండ్‌తో అందించే ఈ పోస్టుల కోసం అర్హత, ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు & విభాగాల వారిగా పోస్టులు:
మొత్తం 627 అప్రెంటిస్ ఖాళీలను వివిధ కేటగిరీల కింద భర్తీ చేస్తున్నారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (193 ఖాళీలు): ఏరోనాటికల్/ఏరోస్పేస్ (8), కంప్యూటర్ సైన్స్ (8), సివిల్ (12), ఎలక్ట్రికల్ (18), ఈసీఈ/టెలికమ్యూనికేషన్ (18), మెకానికల్ (55), మెటలర్జీ (9), ఎంబీఏ & సీఏ/ఎం.కామ్ (9), ఫిజిక్స్ (4), ఇతర టెక్ గ్రాడ్యుయేట్ పోస్టులు.
డిప్లొమా అప్రెంటిస్ (81 ఖాళీలు): ఏరోనాటికల్ (2), సివిల్ (5), కంప్యూటర్ సైన్స్ (4), ఎలక్ట్రికల్ (10), ఈసీఈ (10), మెకానికల్ (35), మెటలర్జీ అండ్ మెటీరియల్స్ (5).
ఇవి కాకుండా NATS 2.0 కింద టెక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఎన్టీఎస్ ట్రైనింగ్ కింద మరిన్ని ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హతలు:
సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్),డిప్లొమా,ఎంబీఏ, సీఏ లేదా ఎం.కామ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అన్ని సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5% సడలింపు ఉంటుంది. అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ కాకుండా.. కేవలం అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమాలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ:
అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లై చేసుకోవడం ఎలా?
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు NATS పోర్టల్ లేదా అధికారిక నోటిఫికేషన్‌లో సూచించిన నిబంధనలను పాటించాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





