HomeLATESTమొబైల్​ యాప్​తో గురుకుల అడ్మిషన్లు

మొబైల్​ యాప్​తో గురుకుల అడ్మిషన్లు

తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ వచ్చే విద్యాసంవత్సరం 2022–23లో 5వ తరగతితో పాటు 6 నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్లు, ఇంటర్మీడియేట్​ సీట్ల భర్తీకి మొబైల్​ యాప్​ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం గూగుల్​ ప్లే స్టోర్​లో ‘టీఎంఆర్​ఈఐఎస్​’ అఏ యాప్​ను డౌన్​ చేసుకోవాలని తెలిపింది. ఏప్రిల్​ 11 వరకు ఈ యాప్​ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతిలో చేరే విద్యార్థులకు మే 9న, 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు అప్లై చేసుకున్న వారికి మే 10, ఇంటర్మీడియేట్​ ప్రవేశాల కోసం మే 21న అడ్మిషన్​ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మే 26 నుంచి జూన్​ 6వరకు సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ చేస్తారు. అనంతరం తరగతులు ప్రారంభమవుతాయి. యాప్​తో పాటు మైనార్టీ గురుకుల అధికారిక వెబ్​సైట్​ www.tmreis.telangana.gov.in లో కూడా అప్లై చేసుకోవచ్చని మైనార్టీ సొసైటీ కార్యదర్శి బి.షఫీఉల్లా తెలిపారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!