TSPSC గ్రూప్ వన్ దరఖాస్తుల గడువును పొడిగించింది. జూన్ 4 వ తేదీ వరకూ గ్రూప్ వన్ అన్ లైన్ దరఖాస్తు గడువు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. అన్ లైన్ అప్లికేషన్ లో ఫీజు చెల్లింపు సమస్యలను ఎదుర్కొంటున్నామని కొంతమంది అభ్యర్థుల నుంచి బోర్డుకు ఫిర్యాదులు అందిన ట్లు TSPSC తెలిపింది. చివరి రోజున కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేయటంతో.. అప్లై చేసుకునే అవకాశం కోల్పోతామనే భయం అభ్యర్థుల్లో వ్యక్తమైంది. దీంతో తమకు అందిన విజ్ఞప్తుల మేరకు అప్లై చేసుకునే గడువును అయిదు రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు TSPSC అధికారులు ప్రకటించారు.
Thanks sir this massage so yousful sir Thanks for giving to me this
This is A very good Aidia sir