HomeLATESTగ్రూప్​ 4 ర్యాంక్​ లిస్ట్ ఎప్పుడు..!

గ్రూప్​ 4 ర్యాంక్​ లిస్ట్ ఎప్పుడు..!

గ్రూప్​ 4​ ర్యాంక్​​ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందా..అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 6న ఫైనల్​ కీ వెలువడింది. వారం రోజుల్లో జనరల్​ ర్యాంకింగ్​ లిస్ట్ (GRL) రిలీజ్​ చేయాలని టీఎస్​పీఎస్​సీ భావించింది. ఈ లోపు ఎలక్షన్​ కోడ్​ వచ్చింది. టీఎస్​పీఎస్​సీ ఫెయిల్యూర్లపై రాష్ట్రమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ టైమ్​లో ర్యాంక్​ లిస్ట్ ఇవ్వటం కంటే ఎన్నికలయ్యేంత వరకు వెయిట్​ చేయటమే బెటర్​ అని టీఎస్​పీఎస్​సీ వర్గాలు దాటవేస్తున్నాయి.

కాగా తెలంగాణలో జూలై 1వ తేదీని టీఎస్ పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 8,180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మొత్తం 9.51లక్షల మంది అభ్యర్తులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం 2878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ టీఎస్ పీఎస్సీ గ్రూప్ 4 పేపర్ 1 జనరల్ స్టడీస్ కు 7,62,872మంది హాజరయ్యారు. పేపర్ 2కు సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఇటీవలే తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష ఫైనల్ కీ విడుదలయిన సంగతి తెలిసిందే.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

  1. Bro, TSPSC helpdesk vallu ee week lo GRL vastundi ani chepparu. Meru okasari confirm cheyyandi me sources nundi please.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!