Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 4కు ఏమేం చదవాలి.. సిలబస్​ లో ఏముంది (పూర్తి వివరణలతో​)

గ్రూప్​ 4కు ఏమేం చదవాలి.. సిలబస్​ లో ఏముంది (పూర్తి వివరణలతో​)

తెలంగాణ గ్రూప్​–4 సిలబస్​

పేపర్-1: జనరల్ స్టడీస్​

Advertisement
  • కరెంట్ అఫైర్స్.
  • అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
  • దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.
  • పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
  • భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
  • భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
  • భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
  • భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
  • తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర.
  • తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
  • తెలంగాణ ప్రభుత్వ పథకాలు.. విధానాలు.

పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్

1. మానసిక సామర్థ్యం. (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)

2. లాజికల్ రీజనింగ్.

3. కాంప్రహెన్షన్.

Advertisement

4. ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.

5. సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు.

ఈ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ అర్హులు. టైపిస్ట్, స్టెనో పోస్టులకు తెలుగు టైప్‍ రైటింగ్‍లో స్టేట్‍ బోర్డ్ ఆఫ్‍ టెక్నికల్‍ ఎగ్జామ్‍ నుంచి హైయర్‍ గ్రేడ్‍ సర్టిఫికెట్‍ ఉండాలి.

Advertisement

గ్రూప్​ 4 ఎగ్జామ్​ ప్యాటర్న్​

ఇందులొ రెండు పేపర్లుంటాయి. పేపర్‍–1 లో జనరల్ నాలెడ్జ్, పేపర్‍–2లో సెక్రెటేరియల్‍ ఎబిలిటీస్‍ నుంచి ఒక్కో సబ్జెక్టులో 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్‍, ఉర్దూ భాషల్లో ఉంటుంది.

పేపర్సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
పేపర్​‌‌ 1జనరల్ నాలెడ్జ్​ 150​ 150
పేపర్​ 2సెక్రటేరియట్​ ఎబిలిటీస్​ 150​ 150

పేపర్​ 1 (జనరల్​ నాలెడ్జి) లో 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి. ఎక్కువ మార్కులు స్కోర్​ చేయాలంటే ఏమేం చదవాలి

సిలబస్​లో కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్య జీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు,  భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం,  తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు ఉన్నాయి.

సిలబస్ మనం పూర్తిగా పరిశీలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ జాగ్రఫీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు లాంటి అంశాలు లేవు. ఇండియన్ హిస్టరీలో ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు గురించి కాకుండా కేవలం జాతీయోద్యమం గురించి మాత్రమే ఉంది. అందుకే సబ్జెక్టు మొత్తం చదవకుండా సిలబస్​ లో ఉన్న టాపిక్స్​ను అభ్యర్థులు సీరియస్​గా ప్రిపేర్​ కావాలి.

Advertisement

సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ సిలబస్ ఒకటే అని భావిస్తారు. కాని సబ్జెక్ట్ ఒకటే అయిన సబ్జెక్టులో ఉన్న అంశాలు ఒకటి కావు. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. అభ్యర్థులు ఈ తేడాను గుర్తించి ఎంత మేరకు చదవాలో.. అంతమేరకు పట్టు సాధించాలి.

కరెంట్ అఫైర్స్:

సిలబస్ లో కరెంట్ అఫైర్స్ ఉంది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్​ అడిగే ఛాన్స్​ ఉంటుంది. కానీ.. జూనియర్​ అసిస్టెంట్​ లెవెల్​ పరీక్ష కావటంతో రాష్ట్ర స్థాయిలో ఉంటే ప్రాంతీయ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. 2022 ఏడాది పొడవునా జరిగిన ముఖ్యమైన సంఘటనలు చదువుకోవాలి. 2023 మార్చి వరకు జరిగే సంఘటనల నుంచి ప్రశ్నలు అడిగే ఆస్కారముంటుంది.

ఇది ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.. జనవరిలో ఏడాది ప్రత్యేక సంచిక వెలువడుతుంది

అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు:

అంతర్జాతీయ సంబంధాలు టాపిక్​లో భారతదేశానికి, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు కవర్​ అవుతాయి. ఉదాహరణకు చైనా, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వస్తాయి.

Advertisement

అంతర్జాతీయ సంఘటనల కిందికి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జీ20, ఐ2యూ2, జీ8, సార్క్, ఆసియాన్ మొదలైనవి, ఒప్పందాలు, ఉల్లంఘనలు చదువుకోవాలి. సౌరశక్తి, పర్యావరణం, క్లైమేట్ ఛేంజ్, అణు, శాంతి ఒప్పందాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి.

DONT MISS TO READ: గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్​​

నిత్య జీవితంలో జనరల్ సైన్స్:

జనరల్ సైన్స్ అంటే విస్తృతంగా ఉంటుంది. అభ్యర్థులు భయపడకుండా సిలబస్​ను అర్థం చేసుకోవాలి. గ్రూప్​ 4 సిలబస్​లో నిజ జీవితంలో జనరల్ సైన్స్ అని ప్రస్తావించారు. అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్​ వరకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు పుస్తకాలు చదవాలి.

Advertisement

పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ:

భౌగోళికమైన అంశాలతో పర్యావరణానికి అనుసంధానం అయ్యే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించి ఇంటర్ స్థాయి పుస్తకాలు చదివి ఆ తర్వాత డిగ్రీ స్థాయిలో అందరికి కామన్​గా ఉండే సిలబస్​పై దృష్టి పెట్టాలి. ఇటీవల దేశ విదేశాల్లో వచ్చిన తుఫానులు, విపత్తులు తప్పకుండా తెలుసుకోవాలి.  

ఇండియన్ జాగ్రఫీ:

దేశ నైసర్గిక స్వరూపం, నదులు, శీతోష్ణస్థితి, నేలలతో పాటు పట్టణీకరణ, రవాణా పై దృష్టి పెట్టాఇ. అట్లాస్ దగ్గర పెట్టుకొని మ్యాప్ పాయింటింగ్ మెథడ్​ ద్వారా ప్రిపేర్ అయితే జాగ్రఫీలో ముఖ్యాంశాలు గుర్తుంచుకోవడం సులువు.

Telugu academy బుక్స్​ నుంచి తయారుచేసిన బిట్​ బ్యాంక్​.. ఉచితంగా డౌన్​ లోడ్ చేసుకొండి

తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం:

  • తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి అసఫ్​జాహీల వరకు సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం గురించి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి.
  • రాష్ట్ర సాధనలో పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, వివిధ వర్గాల పాత్ర, జేఏసీ కార్యక్రమాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
  • తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చదువుకోవాలి.

తెలంగాణ జాగ్రఫీ అండ్ ఎకానమీ:

తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి జాగ్రఫిపై ఫోకస్ పెట్టాలి. ఎక్కడైతే భౌగోళికమైన మార్పులు జరిగాయో అక్కడ దృష్టి సారించాలి. ఉదాహరణకు గ్రూప్–1 ప్రిలిమ్స్​లో కొత్త మండలాల గురించి అడిగారు. చారిత్రాత్మకమైన గ్రామాలు మండలాలుగా మారితే తెలుసుకోవాలి. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి. 100 ఏండ్ల క్రితం ఇనుగుర్తిలోనే తెనుగు పత్రికను స్థాపించారు.

Advertisement

తెలంగాణ ఎకానమీ

తెలంగాణ ఆర్థిక సర్వే, తెలంగాణ అవుట్ లుక్​, తెలంగాణకు సంబంధించిన సమకాలిన అంశాలను చదువుకోవాలి. భూ సంస్కరణలు, పరిశ్రమలు, సేవా రంగాలు జాగ్రత్తగా చదవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే ఛాన్స్​ ఉంటుంది.

ఇండియన్ హిస్టరీ

కేవలం జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ప్రిపేర్ కావాలి.

భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ:

భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు మాత్రమే సిలబస్​ లో ఉంది. రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైతే వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు, కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కొత్త పంచాయతీరాజ్​, మున్సిపల్​ చట్టం నుంచి ప్రశ్నలు వచ్చే ఛాన్స్​ ఉంది.

Advertisement

ఇండియన్ ఎకానమీ:

ఇండియన్ ఎకానమీకి సంబంధించి బీఏ స్థాయిలో డిగ్రీల్లో ఉండే సెమిస్టర్ వైజ్ పుస్తకాలను చదవడం మంచిది. భారతదేశ ఆర్థిక సర్వే, బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలి.

TSPSC గ్రూప్​ 4 పేపర్​ 2.. ఈ సెకండ్​ పేపర్​ ఎలా ఉంటుంది…ఎలా ప్రిపేర్​ కావాలి

సెక్రటేరియల్ ఎబిలిటీ లో 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఈ పేపర్​ కష్టమనే అపోహ కొందరు అభ్యర్థుల్లో ఉంది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. సిలబస్ లో రీజనింగ్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. 2018లో జరిగిన గ్రూప్–4 పరీక్షలో రీజనింగ్ నుంచే 70 ప్రశ్నలు వచ్చాయి. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్​.. అభ్యర్థులు ఎవరైనా కొంచెం మెదడుకు పదును పెడితే వీటిని ఆన్సర్​ చేసే వీలుంది.

సిలబస్ ప్రకారం పేపర్–2 సెక్రటేరియల్ ఎబిలిటీలో అయిదు టాపిక్​లు ఉన్నాయి. ఇందులో రెండు విభాగాలు రీజనింగ్, రెండు విభాగాలు ఇంగ్లిష్, ఒక విభాగం అర్థమెటిక్​కు సంబంధించినవి.

Advertisement
1మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్​)
2లాజికల్ రీజనింగ్
3కాంప్రహెన్షన్
4రీ–అరెంజ్​మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టూ ఇంప్రూవింగ్​ అనాలసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్
5న్యూమరికల్– అర్థమెటికల్ ఎబిలిటీస్

గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే అత్యధికంగా రీజనింగ్ నుంచి (50 శాతం) ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత అర్థమెటిక్ నుంచి ప్రశ్నలను ఇచ్చారు. ఇంగ్లిష్​ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి.

కాంప్రహెన్షన్ ప్యాసేజ్

పేపర్–2లో ఇంగ్లిష్ విభాగంలో రెండు భాగాలు ఉన్నాయి.

  • రీడింగ్ కంప్రహెన్షన్
  • సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్

రీడింగ్ కంప్రహెన్షన్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి దిగువన ప్రశ్నలను ఇస్తారు. ప్యాసేజ్​ అర్థం చేసుకుని ప్రశ్నలను ఆన్సర్​ చేయాలి.

సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్​లో వాక్యాలను క్రమపద్ధతిలో అమర్చాల్సి ఉంటుంది. ఇందులో గ్రామర్, వొకాబులరీ ఉండదు. ఎస్సీఈఆర్టీకి సంబంధించిన 8, 9, 10వ తరగతి ఇంగ్లిష్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. మోడల్ ప్యాసేజ్ లు వరుసగా ప్రాక్టీస్ చేయాలి.

రీజనింగ్

మెంటల్ ఎబిలిటీలో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలుంటాయి.

వెల్బర్ రీజనింగ్​ లో కేలండర్, గడియారాలు, టైమ్ సీక్వెన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, డెరైక్షన్ టెస్ట్, నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అల్ఫాబెటికల్​ టెస్ట్, కోడింగ్– డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, సీటింగ్ అరెంజ్​మెంట్​, అర్థమెటికల్ రీజనింగ్, అనాలజీ, ఆడ్ మెన్​ అవుట్.. తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

నాన్ వెర్బల్ రీజనింగ్​లో క్యూబ్స్ అండ్ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్ ఇమేజస్, వాటర్ ఇమేజస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, కౌంటింగ్ ఫిగర్స్ ముఖ్యమైనవి.

లాజికల్ రీజనింగ్​లో వెన్ డయాగ్రమ్స్, స్టేట్​మెంట్స్​ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్​మెంట్స్​ అండ్ అసంప్షన్స్, అసర్షన్ అండ్ రీజన్, సిల్లోజియమ్ (తీర్మానాలు), డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్ ప్రిటేషన్స్ ముఖ్యమైనవి.

లెక్కల్లో ఈ టాపిక్స్​ కీలకం

అర్థమెటిక్ విభాగంలో సరాసరి, సంఖ్యలు, గసాబా–కసాగు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణాలు, వయస్సులపై ప్రశ్నలు, సంఖ్యపై ప్రశ్నలు, నిష్పత్తి–అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభనష్టాలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, మిశ్రమాలు, కాలం–పని, పంపులు– ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు– ప్రవహాలు, ఆటలు–పందెలు, వైశాల్యములు, ఘణ పరిమాణాలు ముఖ్యమైనవి.

మంచి మార్కులు రావాలంటే టేబుల్స్, వర్గాలు, ఘనాలపై పట్టు సాధించాలి. +, -, X, ÷  గుర్తులతో లెక్కలు స్పీడ్​గా చేయటం ప్రాక్టీస్​ చేయాలి. లెక్కలు చేసిన కొద్దీ.. మార్కులు పెరుగుతాయి. సొంతమవుతాయి.

రివిజన్ ముఖ్యం

అభ్యర్థులు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. వారంలో ఒకసారి ప్రాక్టీస్​ టెస్ట్​, మాక్​ టెస్ట్ లు ప్రాక్టీస్​ చేయాలి. అర్థమెటిక్, రీజనింగ్​ లో ఎక్కువ మార్కులు రావాలంటే ప్రాక్టీస్ అత్యంత కీలకం. సాధన ద్వారానే విజయం వర్తిస్తుంది. ఈ పేపర్​లో 70 శాతం మార్కులు తెచ్చుకోగలిగితే జాబ్​ గ్యారంటీ.


DONT MISS TO READ:
గ్రూప్​ 4 పేపర్​ 1 ప్రిపరేషన్​ ప్లాన్​
గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్ 2018​



గతంలో వివిధ పోటీ పరీక్షల్లో ఈ టాపిక్​ ల నుంచి వచ్చిన ప్రశ్నలు, మోడల్​ ప్రశ్నలు

వెర్బల్ రీజనింగ్

కోడింగ్ డీకోడింగ్ (Coding-Decoding)DOWNLOAD
శ్రేణులు (Series)DOWNLOAD
భిన్న పరీక్ష (Oddmanout)DOWNLOAD
అక్షరమాల పరీక్ష (Alphabet Test)DOWNLOAD
పోలిక / సాదృశ్య పరీక్ష (Analogy)DOWNLOAD
రక్త సంబంధాలు (Blood Relations)DOWNLOAD
దిక్కుల పరీక్ష (Direction Sense Test)DOWNLOAD
నంబర్, ర్యాంకింగ్ & టైమ్ టెస్ట్ (Number, Ranking & Time Sequence Test)DOWNLOAD
సీటింగ్/ ఫేసింగ్ అరేంజ్మెంట్స్ (Seating / Placing Arrangements)DOWNLOAD
పజిల్ టెస్ట్ (Puzzle Test)DOWNLOAD
లాజికల్ వెన్ చిత్రాలు (Logical Venn Diagrams)DOWNLOAD
మ్యాథమెటికల్ సెన్స్ టెస్ట్ (Mathematical Sense Test)DOWNLOAD
మిస్సింగ్ క్యారెక్టర్ (Missing Character)DOWNLOAD

లాజికల్ రీజనింగ్

ప్రకటనలు – తీర్మానాలు (Statements – Conclusions)DOWNLOAD
ప్రకటనలు – ఊహలు (Statements – Assumptions)DOWNLOAD
ప్రకటనలు మరియు వాదనలు (Statements and Arguments)DOWNLOAD
నిశ్చితం – కారణం (Assertion – Reason)DOWNLOAD
డాటా సఫిషియన్సీ (దత్తాంశ యోగ్యత) (Data Sufficiency)DOWNLOAD
జడ్జిమెంట్ (Situation Reaction Test)DOWNLOAD
త్రిపాద తర్కవాదము (Syllogism)DOWNLOAD

నాన్-వెర్బల్ రీజనింగ్

శ్రేణులు (Series)DOWNLOAD
అనాలజీ (Analogy)DOWNLOAD
భిన్నమైనది గుర్తించుట (Oddmanout)DOWNLOAD
అసంపూర్ణ చిత్రాలు పూరించుట (Completion of Incomplete Figures)DOWNLOAD
దాగిన చిత్రాన్ని కనుగొనుట (Finding out Hidden/ Embedded Figures)DOWNLOAD
అద్దంలో ప్రతిబింబం (Mirror Image)DOWNLOAD
నీటిలో ప్రతిబింబం (Water Image)DOWNLOAD
పేపర్ ఫోల్డింగ్ & కట్టింగ్ (Paper folding & Cutting)DOWNLOAD
ఒకే ధర్మాలున్న పటాలు గుర్తించుట (Finding out Identical figures)DOWNLOAD
పట మాత్రిక (Figure Matrix)DOWNLOAD
దీర్ఘఘనం, సమఘనం మరియు పాచికలు (Cuboid, Cube & Dice)DOWNLOAD
TEST OF REASONING
MENTAL ABILITY

previous tests
REASONING Test 1REASONING Test 2
REASONING Test 3 REASONING Test 4
REASONING Test 5 REASONING Test 6
REASONING Test 7 REASONING Test 8
REASONING Test 9 REASONING Test 10
REASONING Test 11REASONING Test 12
REASONING Test 13REASONING Test 14

DONT MISS TO READ:
గ్రూప్​ 4 పేపర్​ 1 ప్రిపరేషన్​ ప్లాన్​
గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్ 2018​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!