HomeLATESTగ్రూప్​ 4 మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలివే​

గ్రూప్​ 4 మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలివే​

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TGPSC) గ్రూప్- 4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ తేదీలను ప్రకటించింది. ఇటీవలే గ్రూప్​ 4 అభ్యర్థుల మెరిట్​ లిస్ట్ ను టీజీపీఎస్​సీ ప్రకటించింది. ఈ మెరిట్​ లిస్ట్​లో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తాజాగా ప్రకటన విడుదల చేసింది. జూన్​ 20 నుంచి ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్​లోనే రెండు సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ ఆఫీస్​తో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. రోజువారి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ షెడ్యూల్​ను కమిషన్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు హాజరుకాని, సర్టిఫికెట్లు సమర్పించని అభ్యర్థులకు ఆగస్టు 24, 27, 28, 29, 30 31వ తేదీలను కమిషన్​ రిజర్వు చేసింది. అభ్యర్థులందరూ గ్రూప్​ 4 పోస్టులకు సంబంధించిన తమ వెబ్​ ఆప్షన్లను ముందుగా నమోదు చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు హాజరు కావాలని ఈ ప్రకటనలో టీజీపీఎస్​సీ స్పష్టం చేసింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!