Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈ నెలలోనే గ్రూప్​ 2.. సేమ్​ సిలబస్​

ఈ నెలలోనే గ్రూప్​ 2.. సేమ్​ సిలబస్​

త్వరలోనే గ్రూప్​ 2 నోటిఫికేషన్​ వెలువడనుంది. టీఎస్​పీఎస్సీ అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. మొత్తం 663 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా పరీక్ష ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. టీఎస్​పీఎస్​సీ గతంలో ప్రకటించిన సిలబస్​ను యథాతథంగా కొనసాగించనుంది. సెప్టెంబర్​ మూడో వారంలో ఈ నోటిఫికేషన్​ వెలువడే అవకాశముంది. జనవరిలో గ్రూప్​ 2 పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. అందుకే అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రూప్​ 2 పై ఫోకస్​ చేయాలి. గ్రూప్​ 2 తో పాటు గ్రూప్​ 3 నోటిఫికేషన్​ కూడా ఇదే నెలలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్​ 2 పోస్టులు, సిలబస్​ వివరాలను అందిస్తున్నాం.

Advertisement

గ్రూప్​ 2 పోస్టులు

గ్రూప్​ 2 సిలబస్​

పేపర్ -1 : (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్)

  • కరెంట్అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
  • అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
  • జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
  • పర్యావరణ సమస్యలు: విపత్తు నివారణ – నిరోధం, తగ్గించే ఉపాయాలు
  • ప్రపంచ, భారతదేశ, తెలంగాణ భూగోళ శాస్త్రం
  • భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
  • తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం
  • తెలంగాణ రాష్ట్ర విధానాలు/ పథకాలు
  • సామాజిక వర్ణణ (సోషల్ ఎక్స్‌క్లూజన్): హక్కుల అంశాలు, సమ్మిళిత విధానాలు
  • లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
  • బేసిక్ ఇంగ్లిష్ (10వ తరగతి స్థాయి)

పేపర్ -2 : (చరిత్ర, రాజ్యాంగం, సమాజం)

  1. భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

1) సింధూ నాగరికత ముఖ్యలక్షణాలు – సమాజం, సంస్కృతి – తొలి, మలి వైదిక నాగరికతలు; క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు మత ఉద్యమాలు – జైన, బౌద్ధ మతాలు; మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళుల సామాజిక, సాంస్కృతిక విశేషాలు, కళలు, ప్రసిద్ధ కట్టడాలు. హర్షుల, రాజపుత్ర యుగం.

2) ఇస్లాం రాక, ఢిల్లీ సుల్తాన్‌ల రాజ్యస్థాపన; సుల్తానత్ రాజ్యంలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు; సూఫీ, భక్తి ఉద్యమాలు; మొగలుల సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యం, కళలు, ప్రసిద్ధ కట్టడాలు; మరాఠుల ఉద్భవం, సాంస్కృతిక పాత్ర; దక్షిణ భారతదేశంలో బహమనీ, విజయనగర రాజ్యాల్లో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు – సాహిత్యం, కళలు, ప్రసిద్ధ నిర్మాణాలు.

3) యూరోపియన్ల రాక: బ్రిటిష్ పరిపాలన ప్రారంభం, విస్తరణ: సామాజిక విధానాలు – కారన్‌వాలీస్, వెల్లస్లీ, విలియం బెంటింక్, డల్హౌసీ, ఇతరులు – 19వ శతాబ్దంలో సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు. భారతదేశంలో సామాజిక ఉద్యమాలు – జ్యోతిబాపూలే, సావిత్రిభాయిపూలే, అయ్యంకాళి, నారాయణగురు, పెరియర్ రామస్వామి నాయకర్, గాంధీ, అంబేడ్కర్ మొదలైనవారు.

4) ప్రాచీన తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు – శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు. మతం, భాష, సాహిత్యం, కళలు, ప్రసిద్ధ కట్టడాలు. మధ్యయుగ తెలంగాణ: కాకతీయుల రాచకొండ, దేవరకొండ, వెలమల; కుతుబ్‌షాహీల – సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి. మిశ్రమ సాంస్కృతిక ఆవర్భావం: జాతరలు, పండగలు, మొహర్రం, ఉర్సు మొదలైనవి.

5) అసఫ్‌జాహీ సామ్రాజ్య స్థాపన: నిజాం ఉల్‌ముల్క్ నుంచి మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు – సాలార్‌జంగ్ సంస్కరణలు – సామాజిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు – జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు – వెట్టీ, భగేల వ్యవస్థ, అప్పటి స్త్రీల పరిస్థితులు. తెలంగాణలో సామాజిక – సాంస్కృతిక ఉద్యమాల ఆవిర్భావం – ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమాలు, గ్రంథాలయ, సాంస్కృతిక ఉద్యమాలు. షెడ్యూల్డ్ తెగల, రైతుల తిరుగుబాట్లు. రాంజీగోండు, కొమరం భీమ్, తెలంగాణ రైతుల సాయుధ పోరాటాలు – పోలీసు/ సైనిక చర్య, నిజాం పాలన అంతం.
ప్రభుత్వాలు – రాష్ట్రపతి – ప్రధానమంత్రి, మంత్రి మండలి, గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి – అధికారాలు, విధులు.

Advertisement
  1. భారత రాజ్యాంగం, రాజకీయాలు
  • భారత రాజ్యాంగ పరిణామ క్రమం – స్వభావం, ప్రధానాంశాలు – ప్రవేశిక.
  • ప్రాథమిక హక్కులు – ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు
  • భారత సమాఖ్య విధాన ముఖ్య లక్షణాలు – కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన అధికారాల పంపిణీ.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభు
  • గ్రామీణ, పట్టణ ప్రాంత (స్థానిక, పురపాలక) పరిపాలన 73వ, 74వ రాజ్యాంగ సవరణల అనుకూలంగా.
  • ఎన్నికల వ్యవస్థ – స్వేచ్ఛ, నిజాయతీతో కూడిన ఎన్నికలు – దుష్ప్రవర్తన, ఎలక్షన్ కమిషన్ – ఎలక్టోరల్ సంస్కరణలు, రాజకీయ పార్టీలు
  • భారతదేశంలో న్యాయవ్యవస్థ – న్యాయవ్యవస్థ క్రియాశీలత
  • ఎ) షెడ్యూలు కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, స్త్రీల, మైనార్టీల ప్రత్యేక నిబంధనలు.
    బి) సంక్షేమ యంత్రాంగం – షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిటీ, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిటీ, వెనుకబడిన తరగతుల జాతీయ కమిటీ
  • భారత రాజ్యాంగం – నూతన సవాళ్లు
  1. సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

భారత సమాజ నిర్మాణం:

  • భారతీయ సమాజ ముఖ్య లక్షణాలు: కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, జాతి, స్త్రీలు, మధ్యతరగతి – తెలంగాణ రాష్ట్ర సామాజిక సాంస్కృతిక లక్షణాలు

    సామాజిక సమస్యలు:
  • అసమానతలు, బహిష్కరణలు – కులవ్యవస్థ, మతవ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థ, స్త్రీ బలత్కారాలు, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణ, వికలాంగులు, వృద్ధులు

    సామాజిక ఉద్యమాలు:
  • రైతు ఉద్యమాలు, షెడ్యూల్డ్ తెగల ఉద్యమాలు, వెనకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, మానవహక్కుల ఉద్యమాలు

    తెలంగాణలో ప్రత్యేక సామాజిక సమస్యలు:
  • వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ – బాల కార్మికులు, స్త్రీ, శిశువు, ఫ్లోరోసిస్, వలసలు, రైతు మరియు నేత కార్మికుల ఇబ్బందులు / ఆపదలు, వికలాంగుల, పిల్లలకు సంబంధించి నిర్ణయాత్మక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు – ఉద్యోగ కల్పన, సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్త్రీలు, మైనార్టీలు, కార్మిక, పేదరిక నిర్మూలన పథకాలు; గ్రామీణ/ పట్టణ స్త్రీల, పిల్లల సంక్షేమం; షెడ్యూల్డ్ తెగల సంక్షేమం.

పేపర్ -3 : (ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి)

I. భారత ఆర్థిక వ్యవస్థ – సమస్యలు, సవాళ్లు

  • వృద్ధి, అభివృద్ధి: వృద్ధి, అభివృద్ధి భావనలు – పెరుగుదల , అభివృద్ధిల సంబంధం.
  • ఆర్థికాభివృద్ధి సూచిక – కొలమానాలు: జాతీయాదాయం – నిర్వచనం, జాతీయాదాయాన్ని లెక్కించే పద్ధతులు, నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం.
  • పేదరికం, నిరుద్యోగం – పేదరిక భావనలు – ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయేతర పేదరికం; పేదరిక కొలమానాలు; నిరుద్యోగిత – నిర్వచనం, నిరుద్యోగిత రకాలు.
  • భారత ఆర్థికవ్యవస్థలో ప్రణాళికలు – ముఖ్య ఉద్దేశాలు, ప్రాముఖ్యతలు, వ్యూహాలు, పంచవర్ష ప్రణాళిక విజయాలు – 12వ పంచవర్ష ప్రణాళిక, ప్రణాళిక అభివృద్ధి, నీతి ఆయోగ్ కమిటీ.

II. తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

Advertisement
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థికవ్యవస్థ (1956 – 2014) – అణచివేత తీరు (బచావత్ కమిటీ), ఆర్థికాంశాలు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి (జై భారత్ కమిటీ, గిర్‌గ్లానీ కమిటీ), అభివృద్ధి పథంలో.
  • తెలంగాణలో భూ సంస్కరణలు – మధ్య దళారీల తొలగింపు – జమీందారీ, ఇనాందారీ వ్యవస్థలు – కౌలు సంస్కరణలు – భూ పరిమితి – షెడ్యూల్డ్ ప్రాంతాల వారికి కేటాయించిన భూమి.
  • వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమలు – జీఎస్‌డీపీలో వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమల వాటా – భూ పంపిణీ – వ్యవసాయ ఆధారం – నీటి పారుదల – నీటి పారుదల సౌకర్యాలు – బీడు భూముల సమస్యలు – వ్యవసాయ పరపతి.
  • పరిశ్రమలు, సేవల రంగాలు – పారిశ్రామికాభివృద్ధి – పరిశ్రమల నిర్మాణం, పెరుగుదల – స్థూల, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల స్థాపన – తెలంగాణ పారిశ్రామిక తీర్మానం – సేవారంగ అభివృద్ధి, నిర్మాణం.

III. అభివృద్ధి సమస్యలు, మార్పు

  • అభివృద్ధి పోకడలు – భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు – సామాజిక అసమానతలు – కుల, తెగ, మతం, లింగ బేధాలు – వలసలు – పట్టణీకరణ.
  • అభివృద్ధి, స్థానచలనం – భూసేకరణ పద్ధతులు – పునః సంస్కరణలు, పునరావాసం.
  • ఆర్థిక సంస్కరణలు – పేదరిక, అసమానతల పెరుగుదల – సామాజిక అభివృద్ధి (విద్య – ఆరోగ్యం), సామాజిక మార్పు, సామాజిక భద్రత.
  • సుస్థిర అభివృద్ధి – భావనలు, అంచనా – సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.

పేపర్ – 4 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

  1. ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 – 70)
  • చారిత్రక నేపథ్యం – హైదరాబాద్ రాచరిక రాష్ట్ర వ్యవస్థలో తెలంగాణ భూగోళ, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక లక్షణాలు – తెలంగాణ ప్రజలు – కులాలు, తెగలు, మతం, కళలు, హస్తకళలు, భాషలు, జాతి భాషలు, జాతరలు, పండగలు, తెలంగాణలో చూడదగిన ప్రదేశాలు. హైదరాబాద్ రాష్ట్ర రాజరిక పరిపాలన, సాలార్‌జంగ్ పరిపాలన సంస్కరణలు. ముల్కీ, ముల్కీయేతర నిబంధనలు, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉద్యోగాలు, పౌర సేవల చట్టాలు; 7వ నిజాం యొక్క 1919 ఫర్మానా – నిజాం స్థాపన; 1935 ముల్కీ లీగ్ నిబంధనలు, వాటి ప్రాధాన్యత; 1948లో భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్ర చేరిక – వెల్లోడి, సైనిక పాలనలో ఉద్యోగ విధానాలు. 1948-52 – ముల్కీ నిబంధనల ఉల్లంఘన, దాని పర్యవసానాలు.
  • స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం – బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో మంత్రిమండలి, 1952 ముల్కీ నిబంధనల ఆందోళన – ప్రాంతీయ ప్రజల ఉద్యోగాల కోసం పోరాటం, సిటీ కాలేజ్ ఘటన, దాని ప్రాముఖ్యత. జస్టిస్ జగన్మోహన్‌రెడ్డి కమిటీ రిపోర్ట్, 1953 – ప్రాథమిక వాదనలు, తెలంగాణ కోసం డిమాండ్ – స్టేట్ రీ-ఆర్గనైజేషన్ కమిషన్ (ఎస్ఆర్‌సీ) 1953లో ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పాటుకు కారణాలు – పునర్ వ్యవస్థీకరణ ముఖ్య సూచనలు – పునర్ వ్యవస్థీకరకణ, చిన్న రాష్ట్రాలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భావనలు.
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1956 – పెద్ద మనుషుల ఒప్పందం – అందులోని సూచనలు – తెలంగాణ ప్రాంతీయ కమిటీ, దాని ఏర్పాట్లు, విధులు, పనితనం – కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజల వలసల ప్రభావం, దాని పర్యవసనాలు – తెలంగాణలో 1970 తర్వాత అభివృద్ధి పరిస్థితులు – వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్, విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్యం మొదలైనవి.
  • ఉద్యోగ, సర్వీసు నిబంధనల ఉల్లంఘన – తెలంగాణ ఆందోళనకు గల మూల కారణాలు – కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకతలు/ ఆందోళనలు – రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలు – జై తెలంగాణ ఉద్యమంలో మేధావుల, విద్యార్థుల, ఉద్యోగుల పాత్ర.
  • తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు – ఉద్యమ విధి విధానాలు – తెలంగాణ ఉద్యమ వ్యాప్తి – ప్రధాన ఘటనలు – నాయకులు, ముఖ్య వ్యక్తులు – అన్ని పార్టీల సమ్మతి – జీవో 36 – తెలంగాణ ఉద్యమ అణచివేత పర్యవసానాలు – 8, 5 సూత్రాల ఫార్ములా అమలు.
  1. సమీకరణ దశ (1971 – 90)
  • ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు – జై ఆంధ్ర ఉద్యమం, దాని పర్యవసానాలు – 6 సూత్రాల పథకం అమలు 1973 – దాని ఏర్పాటు – ఆర్టికల్ 371 డి – రాష్ట్రపతి ఆజ్ఞ – 1975 ఆఫీసర్స్ (జయభారత్‌రెడ్డి కమిటీ రిపోర్ట్, జీవో 610 (1985) – అతిక్రమణ, ఆందోళనలు – తెలంగాణ ఉద్యోగుల ప్రతిచర్య, ప్రాతినిధ్యాలు.
  • నక్సలైట్ ఉద్యమం ఆవిర్భావం, ఉద్యమ వ్యాప్తి – ఉద్యమానికి కారణాలు, దాని పర్యావసనాలు – ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్లలో భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు – రైతు కూలీల సంఘాలు – ఆదివాసీ భూ ఆక్రమణ, ఆదివాసీల వ్యతిరేకత/ అడ్డగింత – జల్, జంగిల్, జమీన్ నినాదాలు.
  • 1980లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం – తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు – తెలుగుజాతి భావనలు, తెలంగాణ గుర్తింపు అణచివేత – హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు నూతన ఆర్థిక వ్యాప్తి – రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఆర్థిక సంస్థలు, సినిమాలు, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలు – కార్పొరేట్ విద్య, హాస్పిటల్స్ మొదలైనవి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం, దాని పర్యవసానాలు, భాష బేధం, సాంస్కృతిక విభేదాలు.
  • 1990లో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దాని ఫలితాలు, రాజకీయ అసమానతలు, పరిపాలన, విద్య, ఉద్యోగాల్లో ప్రాంతీయ భేదాలు ఏర్పడటం, తెలంగాణలో వ్యవసాయ క్షామం, హస్తకళల ఆదరణ తగ్గడంతో తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం.
  • తెలంగాణ అస్థిత్వం కోసం అన్వేషణ – విద్యావేత్తల చర్చలు, వాదనలు, రాజకీయ – తత్వవేత్తల కృషి, ప్రాంతీయ అసమానతలపై తిరుగులేని పోరాటం, తెలంగాణ అభివృద్ధిలో వివక్ష చూపడం.
  1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 – 2014)
  2. ప్రాంతీయ వివక్షపై విద్యావేత్తల, ప్రజల తిరుగుబాటు – ప్రజాసంఘాల ఏర్పాటు – ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజల ఐక్యత రావడం – ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తిన మొట్టమొదటి సంస్థలు – తెలంగాణ సమాచార సంస్థ – తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ – తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ – వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ విద్యార్థుల వేదిక మొదలైనవి. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు.
  3. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు – 2004లో రాజకీయ పున సమీకరణాలు, ఇతర పార్టీలతో తెలంగాణ రాష్ట్రసమితి ఎన్నికల పొత్తులు, తెలంగాణ ఉద్యమ మలిదశ – యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరిక – గిర్‌గ్లానీ కమిటీ – తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ సమితి – ప్రణబ్‌ముఖర్జీ కమిటీ – 2009 ఎన్నికలు, పొత్తులు – ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ – హైదరాబాద్ ఫ్రీజోన్‌పై ఆందోళనలు ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలు – కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష – 2009లో రాజకీయ ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు
  4. రాజకీయ పార్టీల పాత్ర – టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఎంఐఎం, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మొదలైనవి. దళిత బహుజన సంఘాలు, గ్రాస్ రూట్స్ ఉద్యమ సంస్థలు – ఇతర జేఏసీ కమిటీలు, ప్రధాన ఆందోళనలు – తెలంగాణ కోసం బలిదానాలు.
  • తెలంగాణలో సాంస్కృతిక పునఃనిర్మాణం – ఇతర భావ వ్యక్తీకరణలు – విద్యాసంఘాల ఏర్పాటు – కళలు, సాంస్కృతిక వ్యక్తీకరణలు – తెలంగాణ రాష్ట్ర ఆందోళనలను మహా ఉద్యమంగా మలిచినవారు – రచయితలు, కవులు, గాయకులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఎన్ఆర్ఐలు, స్త్రీలు, సామాజిక సంఘాలవారు, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సంస్థలు – ఉద్యమ తీవ్రత, ప్రధాన సదస్సులు – సకల జనుల సమ్మె – సహాయ నిరాకరణ ఉద్యమం – మిలియన్ మార్చ్ మొదలైనవి.
  • పార్లమెంటరీ ప్రక్రియ – తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం మద్దతు – అఖిలపక్ష సమావేశం – ఆంటోనీ కమిటీ – తెలంగాణపై కేంద్ర హోంమంత్రి ప్రకటన – శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్, సూచనలు – పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణపై చర్చ, పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణకై ఆమోదం – ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 ఎన్నికలు – తెలంగాణ రాష్ట్రసమితి విజయం, తెలంగాణ రాష్ట్రసమితి మొదటి ప్రభుత్వం ఏర్పాటు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

merupulu study and jobs group

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!