Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 2, 3, 4 లో ఎన్ని ఖాళీలు పెరుగుతాయో తెలుసా..

గ్రూప్​ 2, 3, 4 లో ఎన్ని ఖాళీలు పెరుగుతాయో తెలుసా..

గ్రూప్​ 2, 3, 4 సర్వీసుల్లో కొత్తగా చేర్చిన పోస్టులతో.. ఎన్ని ఖాళీలు పెరుగుతాయనేది నిరుద్యోగుల్లో ఆసక్తి రేపుతోంది. కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నె.136 ప్రకారం.. ఇప్పటివరకు ఇతర కేటగిరీల్లో ఉన్న పలు పోస్టులు గ్రూప్​ 2, 3, 4 సర్వీసుల జాబితాలో చేరినట్లయింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల సంఖ్య పెరగనుంది. టీఎస్​పీఎస్​సీ ప్రతిపాదించిన మేరకు ఈ పోస్టుల సవరణ పూర్తి కావటంతో వీటికి అనుగుణంగానే గ్రూప్​2, గ్రూప్​ 3, గ్రూప్​ 4 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. డిసెంబర్​లో గ్రూప్​ 2, గ్రూప్​ 4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశమున్నట్లు టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి.

గ్రూప్​ 2 కింద 663 పోస్టులు, గ్రూప్​ 3 కింద 1363 పోస్టులకు అనుమతి ఇస్తూ ఆగస్టులోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కొత్తగా కలిసిన పోస్టులతో గ్రూప్​ 2 లో మరో 100 నుంచి 150 పోస్టులు పెరిగే అవకాశముంది. వీటికి సంబంధించిన రోస్టర్​ పాయింట్లను కూడా ఆయా విభాగాలు టీఎస్​పీఎస్​సీకి అందించాయి. అసిస్టెంట్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ పోస్టులు బీసీ సంక్షేమ శాఖలో 17 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖలో 17, ఎస్టీ సంక్షేమ శాఖలో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో 49 అసిస్టెంట్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ పోస్టులు కొత్తగా చేరినట్లయింది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువైనల్​ సర్వీస్​ విభాగంలో 11 డిస్ట్రిక్ట్ ప్రొబేషన్​ ఆఫీసర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​ పోస్టులు కలిపితే.. ఈ ఖాళీల సంఖ్య వంద దాటుతుంది. దీంతో గ్రూప్​ 2 పోస్టులు 663 నుంచి 750–800 వరకు చేరుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంచనాగా చెబుతున్నాయి. గ్రూప్​ 3, గ్రూప్​ 4 లోనూ ఖాళీల సంఖ్య పెరుగుతుందని.. ఈ రెండింటిలో చేరిన కొత్త పోస్టులు, ఉన్న ఖాళీల ప్రకారం వీటిలోనూ మరో 50 నుంచి 100 పోస్టులు పెరుగుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఆగస్టులో ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టులు

గ్రూప్​ 2, గ్రూప్​ 3 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఆగస్టులోనే ఉత్తర్వులు జారీ చేసింది. (పూర్తి జాబితా పోస్టు చివరలో ఉంది) డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ విధానంలో టీఎస్​పీఎస్​సీ వీటిని భర్తీ చేస్తుందని ప్రకటించింది.

గ్రూప్​ 3 1373
గ్రూప్​ 2 663
అగ్రికల్చర్​ 347
వెటర్నరీ294
కో ఆపరేటివ్​99
గోడౌన్స్​50
సీడ్​ సర్టిఫికేషన్​25
హర్టికల్చర్​21
ఫిషరీస్​15
ఎలక్ట్రిసిటీ11
మార్కెటింగ్​12

గ్రూప్​ 2 లో చేర్చిన పోస్టులు

ఈ సవరణ జీవో ప్రకారం.. అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ ట్రైబల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ సోషల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ పోస్టులు కొత్తగా గ్రూప్​ 2 పోస్టుల పరిధిలో చేర్చారు.

గ్రూప్​ 3 లో చేర్చిన పోస్టులు

ట్రైబల్​ వెల్పేర్​ సర్వీసెస్​ విభాగంలోని అకౌంటెంట్​ పోస్టు, వివిధ విభాగాల్లో ఉన్న సీనియర్​ అసిస్టెంట్​/ అకౌంటెంట్​, జూనియర్​ అసిస్టెంట్​/అకౌంటెంట్​ పోస్టులను గ్రూప్​ 3 పరిధిలో చేర్చారు

గ్రూప్​ 4 లో ఇప్పుడు కొత్తగా చేర్చిన పోస్టులు

జిల్లా విభాగాల పరిధిలోని జూనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అకౌంటెంట్​ పోస్టులు, సూపర్​వైజర్​ (మేల్), మాట్రన్​ కమ్​ స్టోర్​ కీపర్​, మాట్రన్​ పోస్టులను గ్రూప్​ 4 సర్వీసుల పరిధిలోకి చేర్చారు. ​

గ్రూప్​ 2 పోస్టుల ఖాళీల వివరాలు

ముందుగా ప్రకటించిన గ్రూప్​ 2 పోస్టులు ఈ ఉత్తర్వులతో పెరిగాయి. గతంలో 582 ఖాళీలను ప్రకటించగా.. ఈ ఉత్తర్వుల్లో వీటి సంఖ్య 663కు పెరిగాయి. విభాగాల వారీగా ఖాళీల జాబితా..

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!