Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 2, 3, 4 లో పెరుగుతున్న ఖాళీలు.. కొత్త జీవో జారీ

గ్రూప్​ 2, 3, 4 లో పెరుగుతున్న ఖాళీలు.. కొత్త జీవో జారీ

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. గ్రూప్​ 2, గ్రూప్​ 3, గ్రూప్​ 4 ఖాళీలు మరింత పెరుగనున్నాయి. గ్రూప్​, 2, 3, 4 పరిధిలోకి వచ్చే పోస్టులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి కొత్త జీవో నె.136 జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో నెం.55ను సవరిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న మరిన్ని పోస్టులను గ్రూప్​ 2, 3, 4 సర్వీసుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకే తీరుగా ఉండటంతో ఈ మార్పులు చేసింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్​ ఏర్పడింది.

Advertisement

గ్రూప్​ 2 లో చేర్చిన పోస్టులు

ఈ సవరణ జీవో ప్రకారం.. అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ ట్రైబల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ సోషల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ పోస్టులు కొత్తగా గ్రూప్​ 2 పోస్టుల పరిధిలో చేర్చారు.

గ్రూప్​ 3 లో చేర్చిన పోస్టులు

Advertisement

ట్రైబల్​ వెల్పేర్​ సర్వీసెస్​ విభాగంలోని అకౌంటెంట్​ పోస్టు, వివిధ విభాగాల్లో ఉన్న సీనియర్​ అసిస్టెంట్​/ అకౌంటెంట్​, జూనియర్​ అసిస్టెంట్​/అకౌంటెంట్​ పోస్టులను గ్రూప్​ 3 పరిధిలో చేర్చారు.

గ్రూప్​ 4 లో చేర్చిన పోస్టులు

జిల్లా విభాగాల పరిధిలోని జూనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అకౌంటెంట్​ పోస్టులు, సూపర్​వైజర్​ (మేల్), మాట్రన్​ కమ్​ స్టోర్​ కీపర్​, మాట్రన్​ పోస్టులను గ్రూప్​ 4 సర్వీసుల పరిధిలోకి చేర్చారు. ​

Advertisement

దీంతో గ్రూప్​ 2, గ్రూప్​ 3, గ్రూప్​ 4 ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది. టీఎస్​పీఎస్​సీ ప్రతిపాదించిన మేరకు ఈ పోస్టులను సవరించినట్లు, తదనుగుణంగా డైరెక్ట్ రిక్రూట్​మెంట్​కు తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్​ సెక్రెటరీ సోమేష్​కుమార్​ ఈ జీవో జారీ చేశారు.

తెలంగాణ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన ఖాళీల ప్రకారం.. గ్రూప్​ 2: 582, గ్రూప్ 3: 1373. గ్రూప్ 4: 9168 ఖాళీలున్నాయి. కొత్త జీవోతో వీటి సంఖ్య మరింత పెరుగనుండటం నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం ఈ పోస్టుల సవరణకు ఆమోదం తెలుపవటంతో టీఎస్ పీఎస్​సీ ఈ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!