టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్‌లోనూ పొరపాట్లు జరిగాయా.. ? టీఎస్పీఎస్సీ వర్గాల్లోనే ఇది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ జిల్లాలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్ లో గ్రూప్ 1 పేపర్ ఆలస్యంగా నిర్వహించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సెంటర్లోని మూడు రూమ్‌ల్లో మూడు రూముల్లో ఇంగ్లీష్-తెలుగు పేపర్ కు బదులు.. ఇంగ్లీష్ -హిందీ పేపర్ ఇవ్వటంతో అభ్యర్థులు బిత్తరపోయారు. ఏకంగా సెంటర్లోనే ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు సముదాయించినా అభ్యర్థులు తమ ఆందోళన విరమించలేదని తెలిసింది.
అప్పటికే దాదాపు గంట సేపు పరీక్ష టైమ్ ముగియటంతో.. వారికి కొత్త పేపర్.. కొత్త ఓఎంఆర్ షీట్ ఇచ్చి.. అదనపు టైమ్ ఇచ్చి పరీక్ష రాయించినట్లు ఆలస్యంగా బయటపడింది. అభ్యర్థులు సెంటర్ బయటకు వెళ్లలేదని, సెంటర్ లోపలే ఉన్నారని.. అందుకే ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.
Police constable jobs