గ్రూప్ 1 ప్రిలిమినరీ రాతపరీక్షకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జూన్ 1వ తేదీన హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. జూన్ 9వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. పరీక్షను ఆఫ్ లైన్లోనూ నిర్వహించినున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ కమిషన్ ప్రకటించింది. ఓఎంఆర్ షీట్ మోడల్ కూడా కమిషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది.
జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. 4.03 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తడంతో ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. నిబంధనలను పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రిలిమ్స్ ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం ఇస్తూ వెబ్ నోట్ కూడా జారీ చేసింది. ఈ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదొక పద్దతిలో నిర్వహించాలని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈసారి 4.03 లక్షల దరఖాస్తులు రావడంతో సీబీఆర్టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని కమిషన్ అంచనా వేసింది. అందుకే ఒక్కరోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హాల్ టికెట్లు జూన్ 1 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు సూచనలు :