HomeJOBSప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. మెరిట్‌ ద్వారా ఎంపిక

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. మెరిట్‌ ద్వారా ఎంపిక

రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ (GMC).. పలు ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ తో పాటు ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు రేపటి (డిసెంబర్ 26 )నుంచి జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:

మొత్తం పోస్టులు- 60

పోస్ట్ పేరు- కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ పోస్టులు

ఆఫీస్ సబార్డినేట్- 25

జనరల్ డ్యూటీ అటెండెంట్ (GDA): 19

స్టోర్ అటెండెంట్: 03

కార్డియాలజీ టెక్నీషియన్: 03

అనస్థీషియా/ల్యాబ్/OT టెక్నీషియన్స్: ఒక్కో విభాగంలో 02 పోస్టులు

ఇతర పోస్టులు: ECG టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ (ఒక్కో పోస్టు)

అర్హతలు:

విద్యార్హత: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. (APPMB రిజిస్ట్రేషన్ తప్పనిసరి).

వయస్సు: అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 42 ఏళ్లు (01-12-2025 నాటికి) ఉండాలి.( SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది). అంతే కాకుండా దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:

ఫీజును డిమాండ్ డ్రిఫ్ట్ రూపంలో “Principal, GMC Rajamahendravaram” పేరుతో చెల్లించాలి. OC అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. బీసీ/ఎస్సీ/ఎస్టీ/ఈడబ్యూఎస్/దివ్యాంగులు.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరి తేదీ: జనవరి 9 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగానే అభ్యర్థలను ఎంపిక చేస్తారు.

అప్లై చేయడం ఎలా ?

అభ్యర్థులు eastgodavari.ap.gov.in వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

పూర్తి చేసిన అప్లికేషన్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలి.

అప్లికేషన్‌‌ను రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడకల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో స్వయంగా అందజేయాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here