తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 66 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు 1 ట్యూటర్, 4 CAS స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ వంటి వివిధ విభాగాలలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన వైద్య నిపుణులు ఈ వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా,నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, జీతాలు, ఇంటర్వ్యూ తేదీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముఖ్యమైన తేదీలు, వాక్-ఇన్-ఇంటర్వ్యూ వివరాలు:
ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి ముందస్తు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ లేదు. నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ 2 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారు. నారాయణపేట్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆఫీస్లో ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, రెండు జతల సెల్ఫ్-అస్టెడ్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నిర్ణీత సమయానికి హాజరుకావాల్సి ఉంటుంది.
పోస్టుల వారిగా జీతం:
ప్రొఫెసర్: నెల జీతం రూ.1,90,000.
అసోసియేట్ ప్రొఫెసర్: జీతం రూ.1,50,000.
అసిస్టెంట్ ప్రొఫెసర్: జీతం రూ.1,25,000.
CAS స్పెషలిస్ట్: జీతం రూ.80,000.
ట్యూటర్ : జీతం రూ. 55,000.
అర్హతలు,ఎంపిక ప్రక్రియ విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ లేదా పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండటం తప్పనిసరి. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 69 సంవత్సరాల కంటే.. తక్కువగా ఉండాలి. ట్యూటర్, CAS స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఎంబీబీఎస్ లేదా పీజీ మార్కులు, అనుభవం ఆధారంగా ఉంటుంది. నారాయణపేట్ స్థానిక అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత ఇస్తారు.





