HomeADMISSIONSఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గేట్ నోటిఫికేషన్ విడుదల

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గేట్ నోటిఫికేషన్ విడుదల

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంటెక్, వంటి కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనుకునే లక్షలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఐఐటీ మద్రాస్ తాజాగా గేట్ 2027 (GATE 2027) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా ఎంతో కీలకమైన ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఐఐటీ మద్రాస్ అధికారికంగా ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం.ఈ ఏడాది నోటిఫికేషన్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సిలబస్ , పేపర్ల విషయంలో ఐఐటీ మద్రాస్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

కొత్త సిలబస్,పేపర్లు:
తాజా గేట్ 2027 నోటిఫికేషన్‌లో కొత్తగా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ (RA) పేపర్‌ను అదనంగా చేర్చారు. అలాగే గతంలో ప్రత్యేకంగా ఉన్న టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్‌ను ఇంజనీరింగ్ సైన్సెస్ (XE)లో ఒక సెక్షన్‌గా మార్చారు. ఇలా మార్పులు చేసినప్పటికీ.. మొత్తం టెస్ట్ పేపర్ల సంఖ్య మాత్రం గతేడాది మాదిరిగానే కొనసాగుతుంది. ఏరోస్పేస్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ విభాగాలతో పాటు మొత్తం 30 సబ్జెక్టులలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ గేట్ స్కోర్ ఫలితాల ప్రకటన తేదీ నుంచి సుమారు 3 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

అర్హత, అప్లికేషన్ విధానం:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్ డిగ్రీ పూర్తి చేసినవారు, లేదా ప్రస్తుతం డిగ్రీ కోర్సులో మూడో సంవత్సరం లేదా అంతకంటే పై తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకోవడానికి పూర్తిగా అర్హులు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్లు సమర్పించాలి. ప్రతి అభ్యర్థి కేవలం ఒకే ఒక అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రెండు పేపర్లు రాయాలనుకుంటే.. ఒకే ఫారమ్‌లోనే ఆ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.

ఫీజు వివరాలు:
అప్లై చేసుకునే మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (PwD) కేటగిరీల విద్యార్థులు ఒక్కో టెస్ట్ పేపర్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. అలాగే ఇతర జనరల్ కేటగిరీలు , విదేశీ విద్యార్థులు ఒక్కో పేపర్‌కు రూ.2000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్షా విధానం,ముఖ్యమైన తేదీలు:
ఈ కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 3 గంటల పాటు కొనసాగుతుంది. ఇందులో.. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (MCQs), మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ (MSQs), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 65 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: ఆగస్ట్ 14 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: సెప్టెంబర్ 21 వ తేదీ వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంటుంది.

లేట్ ఫీజుతో చివరి తేదీ: సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు

పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో శని,ఆదివారాల్లో రెండు సెషన్లలో (ఉదయం 9:30 – 12:30, మధ్యాహ్నం 2:30 – 5:30) పరీక్షలు జరుగుతాయి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here