దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (IITs) ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే వారికి ‘గేట్’ (GATE) పరీక్ష ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ , ఎన్టీపీస వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి గేట్ స్కోర్ కార్డ్ అత్యంత కీలకం. ఇదిలా ఉంటే గేట్ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంజనీరింగ్,సైన్స్ లేదా హ్యుమానిటీస్ కోర్సులు పూర్తి చేసిన లేదా చదువుతున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్ కోర్సుల్లో మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. సాధారణ ఫీజుతో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 27 ఆఖరి తేదీ. ఒక వేళ ఈ గడువు మిస్ అయితే.. రూ. 500 లేట్ ఫీజుతో అక్టోబర్ 5 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,000 గా నిర్ణయించారు. ఇతరులకు (జనరల్ , ఇతర కేటగిరీలు) రూ.2,000 ఉంటుంది.
లేట్ ఫీజు :అక్టోబర్ 5వరకు అప్లై చేసేవారు అదనంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం, కొత్త మార్పులు:
ఈసారి గేట్ పరీక్షలో కొత్తగా ‘రోల్‌ప్లే అండ్ ఆటోమేషన్’ విభాగాన్ని చేర్చారు. దీంతో కలిపి మొత్తం 30 విభాగాల్లో ఈ పరీక్ష జరగనుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో 100 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు,స్కోర్ చెల్లుబాటు:
గేట్ 2027 పరీక్షలు ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో రెండు సెషన్లలో (ఉదయం, మధ్యాహ్నం) జరుగుతాయి.
ఈ పరీక్ష ద్వారా వచ్చే గేట్ స్కోర్ కార్డు వచ్చిన నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది.





