గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలతో లాగిన్ అయి ఫలితాలను పరిశీలించవచ్చు.
అభ్యర్థులు స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ స్కోర్‌కార్డ్‌లో అభ్యర్థుల మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), క్వాలిఫైయింగ్ స్టేటస్ వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కోర్ మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీలలో ఈ గేట్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ మరియు సైన్స్ విద్యార్థుల కోసం ఇది అత్యంత ప్రాముఖ్యమైన ప్రవేశ పరీక్షగా భావిస్తారు.
గేట్ స్కోర్ ఆధారంగా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో మాస్టర్స్ (M.Tech/ME) మరియు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అదనంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) కూడా ఉద్యోగ నియామకాల కోసం గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి తమ ఫలితాలను చెక్ చేసి స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.





