బీటెక్ అభ్యర్థులకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2022 పూర్తి షెడ్యూల్ ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ విడుదల చేసింది. 2022 జనవరి 3 వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్ష రోజు రెండు సెషన్స్‌లో జరగనుంది.
మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. మార్చి 17 వ తేదీన రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం https://gate.iitkgp.ac.in/index.html వెబ్సైట్ సంప్రదించాలి.
ఎగ్జామ్ టైమ్ టేబుల్
ఫిబ్రవరి 4 (శుక్రవారం) 2:00 – 5:00 Miscellaneous Activities
ఫిబ్రవరి 5 ( శనివారం) 09:00 – 12:00 CS & BM
2:30 – 5:30 EE & MA
ఫిబ్రవరి 6(ఆదివారం) 09:00 – 12:00 EC, ES, ST, NM, MT & MN
2:30 – 5:30 CY, CH, PI, XH, IN, AG, GG & TF
ఫిబ్రవరి 11 (శుక్రవారం) 2:00 – 5:00 Miscellaneous Activities
ఫిబ్రవరి 12 (శనివారం) 09:00 – 12:00 CE-1, BT, PH & EY
2:30 – 5:30 CE-2, XE & XL
ఫిబ్రవరి 13 (ఆదివారం) 09:00 – 12:00 hrs ME-1, PE & AR
2:30 – 5:30 ME-2, GE & AE