ఎఫ్ఎస్ఎస్ఏఐ (fssai) 2026 సంవత్సరానికి గానూ 11వ ఫుడ్ అనలిస్ట్ పరీక్ష (FAE)కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 22 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ ల్యాబొరేటరీలలో పని చేయడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, సర్టిఫికేట్ పొందడం చాలా కీలకం. ఈ పరీక్షకు గరిష్ట వయోపరిమితి లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు అర్హులు?
ఈ పరీక్షకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
విద్యార్హత: కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అగ్రికల్చర్ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లేదా పశువైద్య శాస్త్రాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డాక్టరేట్ చేసి ఉండాలి.
పని అనుభవం: డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదైనా ల్యాబొరేటరీ లేదా సంస్థలో ఆహార విశ్లేషణ (Food Analysis) విభాగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు: ఈ పరీక్షకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: జనవరి 22 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
హాల్ టికెటు: ఫిబ్రవరి 24 న హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
రాత పరీక్ష (CBT): మార్చి 8 రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రాక్టికల్స్: ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.
సర్టిఫికేట్ జారీ: జూన్ 5వ తేదీన సర్టిఫికేట్ జారీ చేస్తారు.
ఎంపిక విధానం:
CBT: మొదట కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఆహార చట్టాలు, రసాయన శాస్త్రం, ల్యాబ్ నిబంధనలపై ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కనీసం 50% మార్కులు సాధించాలి.
Practical: రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ప్రాక్టికల్స్‌కు హాజరు కావాలి
Training: ప్రాక్టికల్స్‌లో కూడా పాసైన వారికి 2 వారాల పాటు FSSAI ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికే ఫైనల్ సర్టిఫికేట్ లభిస్తుంది.
పరీక్షా విధానం:
ఈ పరీక్షలో మొత్తం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. తప్పు సమాధానానికి 1 నెగటివ్ మార్కు ఉంటుంది .
అప్లికేషన్ ఫీజు: (CBT): రూ. 2500 + జీఎస్టీ
ప్రాక్టికల్ పరీక్ష ఫీజు: రూ. 5000 + జీఎస్టీ
అప్లై చేసుకోవడం ఎలా?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://fssai.formsubmit.in/ లోకి లాగిన్ అవ్వాలి.
2. ‘Register’ పై క్లిక్ చేసి మీ వివరాలతో సైన్-అప్ అవ్వండి.
3. లాగిన్ అయిన తర్వాత మీ వ్యక్తిగత, విద్యా, పని అనుభవాకి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
5. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి.





