ఐటీ దిగ్గజం గూగుల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ బెంగళూరు ఆఫీస్ లో నెట్‌వర్క్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి గ్రాడ్యుయేట్ల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 31 మార్చి 2022 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హతలు
అభ్యర్థులు ఏదైనా టెక్నికల్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతమేరకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటింగ్ ఎంటర్‌ప్రైజ్ క్లాస్ రూటర్లు, స్విచ్‌లపై పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. బ్యాక్ ప్లేన్, ASIC ఫంక్షనాలిటీ, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్‌లతో సహా నెట్‌వర్క్ హార్డ్‌వేర్ (రౌటర్లు, స్విచ్‌లు) ఆర్కిటెక్చర్‌లపై పనిచేసిన అనుభవం ఉండాలి. పైథాన్ లేదా ఇతర స్క్రిప్టింగ్ భాషల్లో స్కిల్స్ ఉండాలి. ఇంటర్నెట్, Wi-Fi, TCP/IP, HTTP వంటి నెట్‌వర్కింగ్, అప్లికేషన్ ప్రోటోకాల్స్‌పై నాలెడ్జ్ ఉండాలి. ఓపెన్‌ఫ్లో, సాఫ్ట్‌వేర్ నెట్‌వర్కింగ్‌పై పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు సేవలందించే నెట్‌వర్క్‌ను మెయింటెనెన్స్ చేయాలి. నెట్‌వర్క్ ఇంజనీరింగ్ బృందంతో కలిసి గూగుల్ సిస్టమ్‌లపై పనిచేయాల్సి ఉంటుంది. నెట్‌వర్క్ సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్ ఇంజనీరింగ్ బృందం గూగుల్ కార్పొరేట్ నెట్‌వర్క్‌ను విశ్వసనీయంగా నిర్వహిస్తుంది.నెట్‌వర్క్ ఇంజినీర్ సంప్రదాయ, సాఫ్ట్‌వేర్ నిర్వచించిన నెట్‌వర్కింగ్ (SDN) స్పేస్ రెండింటినీ నిర్వహించాలి.