HomeADMISSIONSఇంటర్‌ పూర్తి చేసిన అమ్మాయిలకు ఫ్రీ పైలట్ ట్రైనింగ్..ఇలా అప్లై చేసుకోండి

ఇంటర్‌ పూర్తి చేసిన అమ్మాయిలకు ఫ్రీ పైలట్ ట్రైనింగ్..ఇలా అప్లై చేసుకోండి

ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ విమానయాన సంస్థ.. ఇండిగో ఒక అద్భుతమైన గుడ్‌న్యూస్‌ను అందించాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పైలట్ కావాలనే కలను వదులుకునే యువతుల కోసం ఉచితంగా ‘కమర్షియల్ పైలట్ లైసెన్స్'(CPL)శిక్షణను అందించేందుకు సరి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అమ్మాయిలకు వసతి, భోజనంతో పాటు ప్రపంచ స్థాయి శిక్షణ ఉచితంగా లభించనుంది.

‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ ప్రత్యేకతలు:
ఆర్థిక సమస్యలు ఏ విద్యార్థిని కలకు కూడా అడ్డుకూడదనే ఉద్దేశంతో ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై'(Giving Wings to Fly) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎంపికైన ప్రతిభావంతులైన యువతులకు విమానయాన రంగంలో అత్యున్నత శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కాలం సుమారు 20 నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో విద్యార్థినులకు కేవలం ట్రైనింగ్ మాత్రమే కాకుండా.. అనేక అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.

ఎంపికైన వారికి లభించే ఉచిత సదుపాయాలు:
ఈ ప్రతిష్టాత్మక శిక్షణా కార్యక్రమంలో సీటు దక్కించుకున్న అమ్మాయిలకు ప్రభుత్వం,సంస్థల ద్వారా క్రింది సౌకర్యాలు కల్పిస్తారు.

1.కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL), ఏటీఆర్‌ టైప్‌ రైటింగ్‌ పూర్తి శిక్షణ.

2.శిక్షణ సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా వసతి.

3.ఆరోగ్యకరమైన, రుచికరమైన పోషకాహారం.

4.విద్యార్థినుల భద్రత కోసం వైద్య బీమా సదుపాయం.

5.అనుభవజ్ఞులైన విమానయాన నిపుణుల నుంచి ప్రత్యేక మెంటర్‌షిప్.

6.కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ సెషన్స్.

మహిళల సాధికారత వైపు మరో అడుగు:
ఈ ఒప్పందంపై ఇంటర్ విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలకు ఇదొక గొప్ప అవకాశమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, అంతే కాకుండా ఏవియేషన్ రంగంలో వారు అగ్రగామిగా రాణించడానికి ఇది చక్కటి వేదికవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ద్వారా ఈ సమాచారాన్ని అర్హులైన విద్యార్థినులందరికీ చేరవేస్తున్నట్లు తెలిపారు.

అప్లికేషన్ విధానం:
ఈ అద్భుతమైన పైలట్ శిక్షణకు అప్లై చేసుకోవాలనుకునే ఆసక్తి గల విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టరేట్ సూచనల ప్రకారం..అర్హత కలిగిన అమ్మాయిలు indigoreachgwf.scholarsbox.in వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేసుకోవాలి. విమానయాన రంగంలో రాణించాలని కలలు కనే ప్రతి ఒక్క యువతి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here