HomeLATESTకోర్సులు.. సర్టిఫికెట్ ఫ్రీ

కోర్సులు.. సర్టిఫికెట్ ఫ్రీ

కరోనా టైమ్​లో చాలా సంస్థలు ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీగా అందించటంతో పాటు సర్టిఫికెట్లను అందిస్తున్నాయి.
..
గూగుల్ అనలిటిక్స్
గూగుల్ అనలిటిక్స్ అకాడమి ఫ్రీ ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తోంది. 6 కోర్సులను ఫ్రీ గా ఆన్‌లైన్‌లో అందిస్తోంది. జీమెయిల్ అకౌంట్‌తో గూగుల్ అనలిటిక్స్ అకాడమిలోకి లాగిన్ అయితే చాలు. నచ్చిన కోర్సుపై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మీరు నేర్చుకునే కోర్సులో ఇచ్చే అసెస్‌మెంట్‌లో 80శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే సర్టిఫికెట్ ఇస్తారు.
పూర్తి వివరాలకు https://analytics.google.com/analytics/academy/ లో చూడవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్‌లో మినీ కోర్సులు అందుబాటులో ఉంచింది.
కోర్సులు
గూగుల్ అనలిటిక్స్ ఫర్ బిగినర్స్
అడ్వాన్స్‌డ్ గూగుల్ అనలిటిక్స్
గూగుల్ అనలిటిక్స్ ఫర్ పవర్ యూజర్స్
గెట్టింగ్ స్టార్టెడ్ విత్ గూగుల్ అనలిటిక్స్ 360
ఇంట్రడక్షన్ టు డేటా స్టూడియో
గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఫండమెంటల్స్

Advertisement

స్క్రమ్ స్టడీ
స్క్రమ్ స్టడీ అనేది స్క్రమ్, ఎగిలె సర్టిఫికేషన్ల గ్లోబల్ అక్రిడేషన్ బాడీ. ఒరాకిల్, సిస్కో, లింక్డ్‌ఇన్ వంటి సంస్థలకు ఫండింగ్ ఇచ్చిన సిలికాన్ వ్యాలీలోని పీఈ ఫర్మ్ సికోయా క్యాపిటల్ స్క్రమ్ స్టడీకి మద్దతు ఇస్తోంది. ఇది 7 కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఈ లింక్ ద్వారా https://www.scrumstudy.com/account/register లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఎంచుకున్న కోర్సుకు 6 నెలల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మై ఎగ్జామ్స్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు. పాస్ అయితే ఉచితంగా సర్టిఫికెట్ ఇస్తారు.
కోర్సులు
సిక్స్ సిగ్మా ఎల్లో బెల్ట్
స్క్రమ్ ఫండమెంటల్స్ సర్టిఫైడ్
మార్కెటింగ్ స్ట్రాటజీ ఫండమెంటల్స్
డిజిటల్ స్ట్రాటజీ ఫండమెంటల్స్
మార్కెటింగ్ రీసెర్చ్ ఫండమెంటల్స్
కార్పొరేట్ సేల్స్ ఫండమెంటల్స్
నెగొషియేషన్ అసోసియేట్

లింక్డ్ ఇన్ లెర్నింగ్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ కలిగిన లింక్డ్ ఇన్ ఫ్రీగా ఆన్‌లైన్ వీడియో కోర్సెస్ అందిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 16 వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులో ఉంచింది. వీటిలో సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ, క్రియేటివ్, బిజినెస్‌కు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవడానికి లింక్డ్ ఇన్ లెర్నింగ్ పోర్టల్‌లోకి వెళ్లి స్టార్ట్ మై ఫ్రీ మంత్ క్లిక్ చేస్తే చాలు. లింక్డ్ ఇన్ అకౌంట్ ద్వారా లాగిన్ కావాలి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కొత్తగా క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక నెల ఫ్రీ ట్రయల్ మాత్రమే ఇస్తారు. రిజిస్టర్ అయ్యేటప్పుడే డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు ఆటో రెన్యువల్ కోసం తీసుకుంటారు. పూర్తి వివరాలకు https://www.linkedin.com/learning/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఆక్స్‌ఫర్డ్ హోమ్ స్టడీ సెంటర్
యూకేలోని ఆక్స్‌ఫర్డ్ హోమ్ స్టడీ సెంటర్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌లకు సంబంధించి 46 ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉంచింది. https://www.oxfordhomestudy.com/free-online-courses-with-certificates వెబ్‌సైట్‌లోకి వెళ్లి నచ్చిన కోర్సును క్లిక్ చేయండి. కోర్సు ఎప్పుడు మొదలవుతుంది? డ్యురేషన్ ఎంత? ఎంట్రీ రిక్వైర్‌‌మెంట్స్ వంటి వివరాలుంటాయి. ఆ తర్వాత స్టార్ట్ యువర్ ఫ్రీ కోర్సు బటన్‌ను క్లిక్ చేయండి. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ రిజిస్టర్డ్ ఈ–మెయిల్‌కు పంపిస్తారు.

Advertisement

ఓపెన్ శాప్
సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్(శాప్) సాప్ట్‌వేర్ నేర్చుకోవడానికి ఓపెన్ శాప్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ చాలారకాల కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. శాప్ గురించి కాకుండా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన కోర్సులు నేర్పిస్తోంది. మొత్తం 60 కోర్సులున్నాయి. ఇందులో 45 కోర్సులు సెల్ఫ్–ఫేస్డ్ మోడ్‌ ఫ్రీ కోర్సులు. మిగతా 15 అప్‌కమింగ్, కరెంట్ కోర్సెస్ కింద కన్పిస్తాయి. వీటిని నేర్చుకోవడానికి ఓపెన్‌శాప్ అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాలి. నేర్చుకునే కోర్సులో ఇచ్చిన అసైన్‌మెంట్‌లో కనీసం 50శాతం పాయింట్స్ సాధిస్తేనే సర్టిఫికెట్ ఇస్తారు. మరిన్ని వివరాలకు https://open.sap.com/courses?q=unlocked వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

సేలర్ అకాడమి
2008 నుంచి ఫ్రీ ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్న సేలర్ అకాడమి 100 వరకు కోర్సులు అందిస్తోంది. ఆర్ట్ హిస్టరీ, బయాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎకనమిక్స్, ఇంగ్లిష్, లెర్నింగ్ స్కిల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, సైకాలజీ, సోషియాలజీ ఇలా అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సేలర్ అకాడమి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయి కోర్సు స్టార్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్‌లో 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే సర్టిఫికెట్ ఇస్తారు. ఎగ్జామ్‌ ఫెయిల్ అయితే ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. కానీ ఎగ్జామ్, ఎగ్జామ్ 7 రోజుల వ్యవధి ఉండాలి. లాగిన్ అవ్వడానికి https://learn.saylor.org/?redirect=0 వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

అప్‌గ్రేడ్
వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ సహకారంతో అప్‌గ్రేడ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఇండస్ట్రి రిలవెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. మొత్తం 19 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జావా ప్రోగ్రామింగ్, బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్‌మెంట్, డేటా సైన్స్‌ వంటి ఎన్నో రకాల కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోర్సు పూర్తయిన సర్టిఫికెట్ ఇస్తారు. కోర్సు నేర్చుకునేందుకు https://www.upgrad.com/free-courses/ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి రిజిస్టర్ కావాలి.

Advertisement

అమెజాన్ వెబ్ సర్వీసెస్
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌గా ప్రసిద్ధి చెందిన ఏడబ్య్లూఎస్ వింగ్ క్లౌడ్ నైపుణ్యాలు కలిగి ఉన్నవారికి వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తోంది. మొత్తం 664 కోర్సులు ఫ్రీగా అందిస్తోంది. అమెజాన్ అకౌంట్‌తో ఏడబ్య్లూఎస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్‌లోకి లాగిన్ కావాలి. డిజిటల్ లెర్నింగ్ కేటగిరి ఉన్న కోర్సులన్నీ ఫ్రీగా నేర్చుకోవచ్చు. సర్టిఫికెట్‌తో సహా కోర్సులన్నీ ఉచితంగా అందిస్తోంది. కోర్సుల పూర్తి వివరాలకు https://www.aws.training/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

కోర్సెరా
వరల్డ్ వైడ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం కోర్సెరా టాప్ యూనివర్సిటీలు, ఆర్గనైజేషన్స్‌తో కలిసి ఆన్‌లైన్ కోర్సులు, డిగ్రీలు, సర్టిఫికెట్లు అందిస్తోంది. మొత్తం 3900కు పైగా కోర్సులు ఉచితంగా అందిస్తున్నప్పటికీ ఇందులో 100కు పైగా కోర్సులకు మాత్రమే ఫ్రీగా సర్టిఫికెట్లు అందిస్తోంది. కోర్సు పూర్తి చేశాక క్విజెస్, ఫైనల్ అసైన్‌మెంట్ ముగిశాక సర్టిఫికెట్ వస్తుంది. కోర్సుల కోసం https://blog.coursera.org/coursera-together-free-online-learning-during-covid-19/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఎలిసన్
ఎలిసన్ 16కు పైగా కేటగిరీలలో కోర్సులు అందిస్తోంది. మొత్తం 24 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సులో 80 శాతానికి పైగా స్కోర్ చేస్తే డిజిటల్ సర్టిఫికెట్ ఇస్తుంది. టెక్నాలజీ, లాంగ్వేజ్, సైన్స్, హెల్త్, హ్యుమనిటీస్, బిజినెస్, మ్యాథ్స్, మార్కెటింగ్, లైఫ్ స్టైల్ ఇలాఅనేక రకాల కేటగిరీలలో కోర్సులున్నాయి. https://alison.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయితే చాలు ఉచితంగా కోర్సులు నేర్చుకోవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!