తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమ శాఖ పరిధి వరంగల్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్-1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, పోలీసు ఇతర ఉద్యోగ నియామక పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సు అందించనున్నారు. అర్హులైన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: గిరిజన తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకూడదు. ఉమ్మడి వరంగల్ జిల్లా (ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం)కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మహిళలకు 33 1/3 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లను కేటాయించారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27 వరకు చేసుకోవచ్చు. నవంబర్ 3న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. పూర్తి వివరాలకు 8374417424 & 9441003400 నంబర్లకు సంప్రదించాలి. సమాచారం కోసం www.studycircle.cgg.gov.in వెబ్సైట్లో చూసుకోవాలి.