Homeకెరీర్​ఎంట్రెన్స్‌ లేకుండానే.. ఫుట్ వేర్ డిజైన్ డిగ్రీ, పీజీ.. ఈ రోజే లాస్ట్ డేట్​

ఎంట్రెన్స్‌ లేకుండానే.. ఫుట్ వేర్ డిజైన్ డిగ్రీ, పీజీ.. ఈ రోజే లాస్ట్ డేట్​

ఫుట్‌వేర్ డిజైనింగ్, ప్రొడక్షన్, లెదర్ గూడ్స్, యాక్ససరీస్, ఫ్యాషన్ డిజైనింగ్‌ కోర్సుల్లో డిగ్రీలు.. పీజీ కోర్సులు చేసేందుకు ఈసారి సదవకాశం. గతంలో ఎంట్రన్స్ ద్వారా సీట్లు కేటాయించే ఈ కోర్సులను కరోనా కారణంగాఎంట్రన్స్ లేకుండానే చేర్చుకునేందుకు ఎఫ్ డీడీఐ ( ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌) నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఏడాది  ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది.  ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కు వారికి గత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా నేరుగా ఈ  కోర్సుల్లో జాయిన్ కావచ్చు.  దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 12 చోట్ల ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వెంటనే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
అప్లై చేసేందుకు చివరి తేది జులై 25. 

విభాగాలు:
ఫుట్వేర్ డిజైన్ & ప్రొడక్షన్, లెదర్ గూడ్స్ & యాక్ససరీస్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ & ఫ్యాషన్ మర్చెంటైజ్​
కోర్సులు;
బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్‌–నాలుగేళ్లు,
బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేష‌న్‌(బీబీఏ)–మూడేళ్లు,
మాస్టర్ ఆఫ్ డిజైన్‌–రెండేళ్లు,
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎంబీఏ)–రెండేళ్లు.
ఎలిజిబులిటి: డిగ్రీ కోర్సులకు ఇంట‌ర్మీడియ‌ట్‌, పీజీ కోర్సులకు బ్యాచిలర్స్, డిగ్రీ ఉత్తీర్ణత. లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.సెలెక్షన్ ప్రాసెస్‌: బ్యాచ్‌లర్ డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. 
ఇది వరకు ఎంట్రెన్స్ టెస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు  వెబ్‌సైట్‌లో మార్కులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.  
వెబ్​ సైట్: www.fddiindia.com

దేశవ్యాప్తంగా ఉన్న 12 ఎఫ్డీడీఐ  క్యాంపస్‌లలో  యూజీ, పీజీల్లో కలిపి మొత్తం  2,970 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు మరో 288 ఎన్‌ఆర్‌ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.  బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో 905 సీట్లు,  లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్ ‌385 సీట్లు,  ఫ్యాషన్‌ డిజైన్‌ 930 సీట్లు,  బీబీఏ రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌300 సీట్లు ఉన్నాయి.  మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి.  ఎంబీఏ (రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌)లో 300 సీట్లు ఉన్నాయి. ఎంబీఏ చేయాలనుకునేవారు మ్యాట్ స్కోరుతో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎంబీఏకు 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

12  క్యాంపస్‌లు

హైదరాబాద్( తెలంగాణ),
నోయిడా(ఉత్తరప్రదేశ్), 
చెన్నై(తమిళనాడు),
ఫుర్సత్‌గంజ్(ఉత్తరప్రదేశ్‌),
రోహ్‌తక్(హర్యానా),
జోధ్‌పూర్(రాజస్థాన్‌),
చింద్వారా(మధ్యప్రదేశ్), 
గునా(హర్యానా),
అంకేశ్వర్(గుజరాత్),
కోల్‌కతా(పశ్చిమబెంగాల్),
పాట్నా(బిహార్‌‌),
చండీగఢ్‌(పంజాబ్

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!