ఇంటర్ విద్యార్థుల రిజల్ట్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులనే సెకండ్ ఇయర్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేయటంతో.. తమకు మార్కులు ఎలా కేటాయిస్తారని ఇప్పటికే విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫస్ట్ ఇయర్లో ఫెయిలైన విద్యార్థులుంటే ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు కేటాయించి పాస్ అయినట్లు గుర్తిస్తారు. సెకండియర్ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులు ఇస్తారు. ప్రైవేటుగా పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులందరికీ 35 శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రాక్టికల్స్ లో అందరు విద్యార్థులకు వందకు వంద మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు. ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
