HomeLATESTట్రైబల్ వెల్ఫేర్లో ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్

ట్రైబల్ వెల్ఫేర్లో ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్

తెలంగాణ ట్రైబల్​ వెల్ఫేర్​ ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని బోడుప్పల్​(బాలికలు), నాదర్​గుల్​(బాలురు) పాఠశాలల్లో 2020–21 ఏడాదికి గాను ఆరో తరగతితో పాటు వివిధ ఫైనార్ట్స్ కోర్సుల్లో రెసిడెన్షియల్​ విధానంలో ఇంటిగ్రేటెడ్​ కోచింగ్​ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫైన్​ ఆర్ట్స్ కోర్సులు: వోకల్, వయోలిన్​, మృదంగం, తబ్లా, కీబోర్డ్​, గిటార్​, డాన్స్, థియేటర్​ ఆర్ట్స్​, పెయింటింగ్ అండ్​ డ్రాయింగ్
మొత్తం సీట్లు: 160 (బోడుప్పల్​–80, నాదర్​గుల్​–80)
అర్హత: ఐదో తరగతి ఉత్తీర్ణత. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం అర్బన్​లో 2 లక్షలు, రూరల్​లో 1.5 లక్షలకు మించకూడదు.
వయసు: 2008 సెప్టెంబర్​ 1 నుంచి 2010 ఆగస్ట్​ 31 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఫీజు: రూ.100
చివరితేది: 2020 ఆగస్ట్​ 16
వెబ్​సైట్​: www.tgtwgurukulam.telangana.gov.in

Advertisement

ఎంజీయూఎంఎస్​టీలో యూజీ పీజీ కోర్సుల అడ్మిషన్లు

జైపూర్‌లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ(ఎంజీయూఎంఎస్​టీ) … 2020–21 ఏడాదికి గాను యూజీ, పీజీ, ఎంఫిల్​, పీహెచ్​డీ, ఫెలోషిప్​, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. స్పెషలైజేషన్స్​: మెడికల్​ అండ్​ డెంటల్​, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్​ థెరపీ, హెల్త్​/మెడికల్ టెక్నాలజీ, నర్సింగ్​ తదితరాలు; అర్హత: 10+2, సంబంధిత విభాగాల్లో ఎంఎస్​/డీఎన్​బీ/డిప్లొమా, ఎంబీబీఎస్​/బీడీఎస్​/బీఎస్సీ ఉత్తీర్ణత;
సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రన్స్​ టెస్ట్​ ద్వారా;ఫీజు: రూ.1500;
చివరితేది: 2020 ఆగస్టు 24;
వివరాలకు: www.mgumst.org

యూనివర్సిటీ ఆఫ్‌ మణిపూర్‌లో..

యూనివర్సిటీ ఆఫ్‌ మణిపూర్‌… 2020–21 ఏడాదికి గాను వివిధ డిగ్రీ వొకేషనల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బ్యాచిలర్​ ఆఫ్ ఒకేషనల్​ ఇన్​ టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్​ ఆఫ్ ఒకేషనల్​ ఇన్​ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, పీజీ డిప్లొమా ఇన్​ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఫారిన్‌ ట్రేడ్‌; అర్హత: 10+2, సంబంధిత సబ్టెక్టుల్లో బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత;
సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష, పర్సనల్​ ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీలకు రూ.200;
చివరితేది: వొకేషనల్‌ డిగ్రీ కోర్సులకు 2020 ఆగస్టు 20, పీజీ డిప్లొమాకు ఆగస్టు 30;
వివరాలకు: www.manipuruniv.ac.in

యూనివర్సిటీ ఆఫ్‌ కేరళలో..

యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ… 2020–21 ఏడాదికి గాను వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఎస్‌డబ్యూ, బీఎమ్​ఎస్; స్పెషలైజేషన్స్​: ఇంగ్లిష్, హిస్టరీ, ఫిలాసఫీ, సంస్కృతం, సోషియాలజీ, ఎకనామిక్స్​, పొలిటికల్​ సైన్స్​, జర్నలిజం అండ్​ మాస్​ కమ్యూనికేషన్​, మ్యూజిక్​, ఫైనాన్స్​, బిజినెస్​ అడ్మినిస్ట్రేషన్​, సోషల్ వర్క్​
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణత; ఫీజు: జనరల్/ ఓబీసీలకు: రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.250;
చివరితేది: 2020 ఆగస్టు 17;
వివరాలకు: www.admissions.keralauniversity.ac.in 

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!