తెలంగాణలో స్కూళ్లో రీ ఓపెనింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ నెల 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారంతో ఈ గడువు ముగియనుండటంతో మరో వారం రోజులు సెలవులు పొడిగిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతుండటంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్య శాఖ సలహా ఇచ్చింది. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ప్రైమరీ స్కూల్స్ ను మినహాయించి మిగతా తరగతులు, కాలేజీలు, యూనివర్సిటీలన్నీ రీఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపట్లో వెలువడనుంది. జనవిరి 31 నుంచి ప్రైమరీ స్కూల్స్ తప్ప అన్ని విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌కు అనుమతించనున్నట్లు విద్యా శాఖ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ అన్ని స్కూళ్లు, కాలేజీల్లో కఠినంగా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఇప్పటికే అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, గురుకుల కాలేజీలు కూడా 31 వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి.
స్కూళ్ల రీఓపెన్‌పై కీలక నిర్ణయం
Advertisement