యూజీసీ నెట్ – 2025 పరీక్షలకు సంబంధించి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం అర్హత సాధించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఈ రోజు 11.50 pm వరకు అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 7 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్: నవంబర్ 10 వ తేదీ నుంచి 12 తేదీ మధ్య ఎడిట్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీలు: డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
విద్యార్హత: అభ్యర్థులు 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి. ఓబీసీ ఎన్సీఎల్ /ఎస్సీఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అవసరం ఉంటుంది.
వయస్సు (01.12.2025 నాటికి): జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే వారు 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు.. గరిష్ట వయోపరిమితి లేదు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ / అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులు రూ. 1150 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్- ఈడబ్యూఎసం/ఓబీసీ-ఎన్ సీఎల్ అభ్యర్థులు రూ. 600, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు /థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 325 చెల్లించాల్సి ఉంటుంది.
సబ్జెక్టులు (మొత్తం 85):
అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబిక్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, హోం సైన్స్, లా, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ తదితరాలు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT).
ప్రశ్నల రకం: ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్- 1 లో 150 ప్రశ్నలు ఉంటాయి. దీనిలో జనరల్ ఆప్టిట్యూట్, టీచింగ్, రీసెర్చ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పేపర్ – 2 కు 100 ప్రశ్నలు ఉండగా 200 మార్కులు కేటాయించారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, కడప, కాకినాడ, కర్నూలు, సూర్యపేట్, వరంగల్, అనంతపురం,నంద్యాల, చిత్తూరు, ఏలూరు. గుంటూరు, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమహేంద్రవరం, నరసరావు పేట, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.





