Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎన్‌పీడీసీఎల్‌లో ఆపరేటర్ జాబ్స్ ఎగ్జామ్​ ఎలా ఉంటుంది.. ఏప్రిల్​ 29 వరకు అప్లికేషన్లు

ఎన్‌పీడీసీఎల్‌లో ఆపరేటర్ జాబ్స్ ఎగ్జామ్​ ఎలా ఉంటుంది.. ఏప్రిల్​ 29 వరకు అప్లికేషన్లు

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL)  డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (JUNIOR ASSISTANT/COMPUTER OPERATOR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 95 శాతం పోస్టులను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల అభ్యర్థులకు, 5 శాతం పోస్టులను ఇతరులకు కేటాయించారు.

Advertisement

వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబుబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు NPDCL పరిధిలోకి వస్తాయి. బీఏ/బీఎస్సీ/ బీకామ్‌తో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌/ ఆఫీస్‌ ఆటోమేషన్‌ (ఎంఎస్‌ ఆఫీస్‌) సర్టిఫికెట్‌ కోర్సు పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష మే 28న నిర్వహిస్తారు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్‌ను వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఎగ్జామ్ ప్యాటర్న్

సబ్జెక్ట్ప్రశ్నలు మార్కులు
న్యూమరికల్ ఎబిలిటి అండ్ రీజనింగ్ 40 40
కంప్యూటర్ అవేర్నెస్ 20 20
ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ 2020
మొత్తం80 80

పరీక్ష ఎలా ఉంటుంది  

ఎగ్జామ్ ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిఫుల్​ చాయిస్​ క్వశ్చన్స్​ ఉంటాయి. వ్యవధి రెండు గంటలు. ఓఎంఆర్‌ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 40 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి. బీసీలు 35శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి. పేపర్ తెలుగు, ఇంగ్లీష్‌  మీడియంలో ఉంటుంది.

Advertisement

సెక్షన్‌–ఎ: న్యూమరికల్‌ ఎబిలిటీ సబ్జెక్టు నుంచి ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, మెన్సురేషన్‌, ఆల్జీబ్రా, రేషియోస్‌, ప్రపోర్షన్స్‌, జామెట్రీ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఉంటాయి. లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌ ఆండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

సెక్షన్–బీ: కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లో ఎంఎస్‌-ఆఫీస్‌, బీసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషనేషన్స్ అండ్ స్కిల్స్, అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.

సెక్షన్–సీ: ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ, కాంప్రహెన్షన్ పాసేజెస్‌ అండ్‌ రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌
సెంటెన్సెస్‌, సినోనిమ్స్‌ అండ్‌ ఆంటోనిమ్స్‌ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

Advertisement

జనరల్‌ నాలెడ్డ్‌ విభాగం నుంచి కరెంట్‌ అఫైర్స్‌,  కన్సూమర్‌ రిలేషన్స్‌, జనరల్‌ సైన్స్‌ ఇన్‌ ఎవ్రిడే లైఫ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

టీఎస్‌ ట్రాన్స్‌కో/ టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌/ టీఎస్‌ ఎస్పీడీసీ ఎల్‌ పనిచేస్తున్నవారికి 20 వెయిటేజీ మార్కులు ఉంటాయి. ఆరు నెలలకు 1 మార్కు చొప్పున ఇస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు వీటిని కలుపుతారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉంటే వెయిటేజీ మార్కుల నియమం వర్తించదు.

నోటిఫికేషన్

అర్హత: బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌/ ఆఫీస్‌ ఆటోమేషన్‌(ఎంఎస్‌ ఆఫీస్‌) సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.  నెలకు రూ.29,255 నుంచి రూ.54,380 వేతనం చెల్లిస్తారు.

Advertisement

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 28న నిర్వహిస్తారు. వివరాలకు www.tsnpdcl.in వెబ్సైట్ సంప్రదించాలి. 

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!