HomeJOBSహైదరాబాద్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హైదరాబాద్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. టీచింగ్ ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్), సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 45 ఉద్యోగాలను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 10 వ తేదీ నుంచి 16 వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు M.Sc, MS/MD లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు- 45
కార్డియాలజీ- 07
CTVS- 02
నెఫ్రాలజీ- 03
న్యూరాలజీ- 05
న్యూరో సర్జరీ- 02
పీడియాట్రిక్ సర్జరీ – 02
అనస్థీషియా- 07
అనస్థీటిస్ట్- 03
యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ-02
ఐసీయూ- 02
రేడియాలజీ- 07
యూరాలజీ- 03

వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ: డిసెంబర్ 10.

చివరి తేదీ: డిసెంబర్ 16.

అధికారిక వెబ్‌సైట్: www.esic.gov

అర్హతలు :
విద్యార్హతలు: NMC రెగ్యులేషన్స్ 2025 ప్రకారం ఉండాలి. అభ్యర్థులు M.Sc, MS/MD లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయస్సు:
ఫ్యాకల్టీ (ప్రొఫెసర్/అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టులకు అప్లై చేసుకునే వారు 69 సంవత్సరాలు మించకూడదు.

సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు 45 సంవత్సరాలు మించకూడదు.

అప్లికేషన్ ఫీజు: అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం/స్టైఫండ్:
పోస్టుల ఆధారంగా జీతాలు చెల్లిస్తారు.

ప్రొఫెసర్: రూ. 2,56,671

అసోసియేట్ ప్రొఫెసర్: రూ. 1,70,681

అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ. 1,46,638

సీనియర్ రెసిడెంట్ (3 సంవత్సరాలు): 7వ CPC లెవెల్-11 (బేసిక్ రూ. 67,700 + DA, NPA, HRA మొదలైనవి).

వాక్-ఇన్ ఇంటర్వ్యూ షెడ్యూల్:
కార్డియాలజీ: 10-12-2025 @ 10:30 AM
AMCTVS: 10-12-2025 @ 02:00 PM
నెఫ్రాలజీ: 11-12-2025 @ 10:30 AM
న్యూరాలజీ: 11-12-2025 @ 02:00 PM
న్యూరో సర్జరీ: 12-12-2025 @ 10:30 AM
పీడియాట్రిక్ సర్జరీ: 12-12-2025 @ 02:00 PM
అనస్థీషియా / అనస్థీటిస్ట్ (SS తో) / A&E/ICU:15-12-2025
రేడియాలజీ / యూరాలజీ: 16-12-2025

అప్లికేషన్ విధానం:
షెడ్యూల్ చేసిన తేదీ, సమయానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూకు అభ్యర్థులు హాజరు కావాలి.

నిర్దేశిత ప్రోఫార్మా (అనెక్సూర్-IV)లో అప్లికేషన్ నింపి సిద్ధంగా ఉంచుకోవాలి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇంటర్వ్యూ సమయానికి ఒక గంట ముందుగా రిపోర్ట్ చేయాలి.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: కాన్ఫరెన్స్ హాల్, 2వ అంతస్తు, ESIC సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్

ఈ రిక్రూట్‌మెంట్ గురించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా.. ESIC అధికారిక వెబ్‌సైట్ esic.gov.in చెక్ చేయాలి

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here