యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ESE) ప్రిలిమనరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలలో ఇంజనీర్ పోస్టులని దీని ద్వారా భర్తీ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి,అర్హత కల అభ్యర్థులు ఆన్ లైన్ లో అక్టోబర్ 4 వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. 30 ఏళ్ల గరిష్ట వయో పరిమితి ఉంటుంది. పూర్తి వివరాలు యూ పీ ఎస్ సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రిలిమనరీ ఎగ్జామ్ 2023 ఫిబ్రవరి 19 వ తేదీన నిర్వహిస్తారు. https://www.upsc.gov.in/