పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్), సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీటీయూఐఎల్) వివిధ విభాగాల్లో గేట్-2024 ద్వారా 435 ఇంజినీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు:
మొత్తం 435 ఖాళీలు
ఎలక్ట్రికల్- 331,
ఎలక్ట్రానిక్స్- 14,
సివిల్- 53,
కంప్యూటర్ సైన్స్- 37 పోస్టులు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.powergrid.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.