కేంద్రీయ విశ్వవిద్యాలయమైన హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2022- – 2023 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 18 వరకు అప్లై చేసుకోవాలి.
పీజీ డిప్లొమా ప్రోగ్రాములు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ (పీజీడీటీఈ), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ద టీచింగ్ ఆఫ్ అరబిక్ (పీజీడీటీఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ద టీచింగ్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్ (పీజీడీటీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
పీహెచ్‌డీ ప్రోగ్రాములు: లింగ్విస్టిక్స్ అండ్ ఫోనెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, హిందీ, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్, ఇంగ్లిష్ లిటరేచర్, కంపరేటివ్ లిటరేచర్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్ స్పెషలైజేషన్స్ పీహెచ్‌డీ కోర్సులో ఉన్నాయి. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ ఎంఫిల్ ఉత్తీర్ణత.