కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్‌కు ఈనాడు జర్నలిజం స్కూల్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసేవారూ అర్హులే. తెలుగులో రాయగల నేర్పు. ఇంగ్లీష్ పై అవగాహన. లోకజ్ఞానం, కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 9 డిసెంబర్ 2024 నాటికి వయసు 28కి మించరాదు.
సెలెక్షన్: మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, ట్రాన్ష్లేషన్ స్కిల్స్, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి.
ట్రైనింగ్: ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు రూ.14,000, తరువాతి ఆరు నెలలు రూ.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో రూ.19,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో రూ.21,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో రూ.23,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 27న ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. డిసెంబర్ 9 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు www.eenadu.net వెబ్సైట్లో సంప్రదించాలి.