HomeLATESTటెట్​ ఎడిట్​ ఆప్షన్ పై 28న క్లారిటీ !

టెట్​ ఎడిట్​ ఆప్షన్ పై 28న క్లారిటీ !

టెట్​ ఎడిట్​ అప్షన్​ ఉంటుందా.. ఉండదా.. అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. జూన్​ 6 వతేదీ నుంచి టెట్​ హాల్​ టికెట్లను డౌన్​ లోడ్ చేసుకునేందుకు వెబ్​సైట్​లో ఆప్షన్​ అందుబాటులోకి రానుంది. ఈసారి చాలా మంది అభ్యర్థులు టెట్​ అప్లికేషన్​లో మిస్టేక్స్​ చేశారు. తప్పుడు అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకోమని వారికి ఎగ్జామ్​కు కూడా అనుమతించబోమని ఎస్​సీఈఆర్​టీ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే హాల్​ టికెట్లను డౌన్‌లోడ్​ చేసుకునే ముందే ఎడిట్​ ఆప్షన్​ పెట్టాలని అభ్యర్థుల నుంచి వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిట్​ ఆప్షన్​పై క్లారిటీ ఇవ్వాలని టెట్​ అభ్యర్థులు సోషల్​ మీడియా ద్వారా మంత్రి సబితా విద్యారెడ్డికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్​ టెట్​ జూన్​ 12న నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 28న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఈవోలు, డీఐఈవోలు, డీటీవోలు, ట్రాన్స్​కో, ఆర్టీసీ తదితర డిపార్ట్​మెంట్ల అధికారులతో సమావేశమై టెట్​ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పలు సూచనలు, సలహాలు, ఏర్పాట్లను వివరించనున్నారు.

సుమారు 3.8లక్షల మంది అభ్యర్థులు పేపర్​–1, పేపర్​–2కు కలిపి 6లక్షల దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న స్కూళ్లు, ఇంటర్​, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్​, ఇంజినీరింగ్​ కాలేజీలు మొత్తం 1600 ఎగ్జామ్​ సెంటర్లను వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేపర్​–1 ఉదయం 9.30గం. నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, పేపర్​ –2 మధ్యామ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00గం. వరకు నిర్వహించనున్నారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

8 COMMENTS

  1. Sir apply cheyaledu pls maa kosam date podiginchara konni problems valla intime lo apply cheyalekapoya days vunchi apply cheskodaniki date ivvandi sir

  2. Sir .,HindiTet vallu chala confusion lo . unnaru ….inka kontha mandi apply cheyaledu date extend cheyara please

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!