HomeJOBSఆటిజం సెంటర్లలో.. 879 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆటిజం సెంటర్లలో.. 879 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఎడ్‌సిల్’ (EdCIL India Ltd) గుడ్ న్యూస్ అందించింది. ఏపీలోని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పీఎం శ్రీ కింద పనిచేస్తున్న ఆటిజం సెంటర్లలో మల్టీడిసిప్లినరీ స్టాఫ్, పీఎంయూ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 879 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 4 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు :
మొత్తం ఖాళీలలో స్పెషల్ ఎడ్యుకేటర్లు,థెరపిస్టులు, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి.పోస్టుల వారీగా వివరాలు..
1.ఆక్యుపేషనల్ థెరపిస్ట్,ఫిజియోథెరపిస్ట్,సైకాలజిస్ట్,స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్,స్పెషల్ ఎడ్యుకేటర్ (సెకండరీ లెవెల్): ఈ పోస్టులకు ఒక్కో కేటగిరీలో 125 ఖాళీలు ఉన్నాయి. వీరికి నెలకు రూ.30,000 చొప్పున జీతం ఇస్తారు.
2.స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ లెవెల్): దీనికి కూడా 125 ఖాళీలు ఉన్నాయి. వీరికి నెలకు రూ. 25,000 జీతం ఇస్తారు.
3.PMU కన్సల్టెంట్: 4 పోస్టులు ఉన్నాయి.వీరికి అత్యధికంగా నెలకు రూ. 55,000 జీతం లభిస్తుంది.

అర్హతలు :
సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ లేదా డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ముఖ్యంగా స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు , రిజిస్ట్రేషన్ (CRR నంబర్) తప్పనిసరి. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఏపీ టెట్ (AP TET) లేదా సీటెట్ (CTET) పాసై ఉండాలి.

వయస్సు: 30 ఏప్రిల్ 2026 నాటికి అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: 04 జూన్ .

ఎలా అప్లై చేయాలి?

అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

  1. ముందుగా ఎడ్‌సిల్ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://tsgrecruitment.edcil.co.in/login లోకి లాగిన్ అవ్వాలి.
  2. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరం అయిన వివరాలన్నింటినీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
  3. సర్టిఫికెట్లు, రెజ్యూమ్, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ అన్నింటినీ PDF ఫార్మాట్ లో మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
  4. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వివరాలన్నీ చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయాలి.

అభ్యర్థులు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tsgrecruitment.edcil.co.in/login సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here