HomeJOBSఐటీఐ అర్హతతో.. రైల్వేలో 1,599 ఉద్యోగాలు

ఐటీఐ అర్హతతో.. రైల్వేలో 1,599 ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. భువనేశ్వర్ రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా 1,599 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి 25 రకాల ట్రేడ్స్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ టెన్షన్ లేకుండా కేవలం టెన్త్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు.

ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్ జాబ్స్ 2026..పూర్తి వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భువనేశ్వర్ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సంబల్‌పూర్, ఖుర్దా రోడ్ డివిజన్‌లలో మొత్తం 1,599 ట్రెయినింగ్ స్లాట్లను భర్తీ చేయనున్నారు.

ట్రేడ్-వారీగా పోస్టుల విభజన (యూనిట్ వారీగా):
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,599 పోస్టులను ప్రముఖంగా ఐదు యూనిట్లకు కేటాయించారు.

ఖుర్దా రోడ్ డివిజన్ (ELS, అంగుల్ & IOH డిపో): అత్యధికంగా 773 పోస్టులు (ఇంజనీరింగ్,ఎస్&టీ,ఎలక్ట్రికల్,మెడికల్,మెకానికల్ విభాగాలు).

సంబల్‌పూర్ డివిజన్ (కోచింగ్, BLGR): 262 పోస్టులు.

ఆర్జీడీఏ (RGDA) డివిజన్: 292 పోస్టులు.

క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, మంచేశ్వర్, భువనేశ్వర్: 250 పోస్టులు.

హెడ్‌క్వార్టర్స్, ECoR, భువనేశ్వర్: 22 పోస్టులు.

రిజర్వేషన్లు, కేటగిరీల వారీగా ఖాళీలు:
యూఆర్ (UR): 633 పోస్టులు

ఓబీసీ (OBC): 435 పోస్టులు

ఎస్సీ (SC): 251 పోస్టులు

ఈడబ్ల్యూఎస్ (EWS): 164 పోస్టులు

ఎస్టీ (ST): 116 పోస్టులు

దివ్యాంగులు (PwBD): 4% (మొత్తం స్లాట్లలో హారిజాంటల్ రిజర్వేషన్ కింద 50 పోస్టులు)

మాజీ సైనికులు (ESM): 3% (42 పోస్టులు)

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం:
ఆగస్టు 26వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరి తేదీ: సెప్టెంబర్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు చేసుకోవచ్చు.

విద్యార్హతలు & వయస్సు:
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 15, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు..అధికారిక వెబ్ సైట్ eastcoastrail.indianrailways.gov.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here