ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 2025 సంవత్సరానికి 125 సీనియర్ ఆర్టిసన్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్‌లోని వివిధ బిజినెస్ వెర్టికల్స్‌లో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ECIL అధికారిక వెబ్‌సైట్( www.ecil.co.in )ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
పోస్టుల సంఖ్య: 125 సీనియర్ ఆర్టిసన్ పోస్టులు (కేటగిరీ-1 & కేటగిరీ-2).
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో రెండు సంవత్సరాల ITI (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) సర్టిఫికేట్ పొంది ఉండాలి.
సీనియర్ ఆర్టిసన్ (కేటగిరీ-1) కోసం: పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్స్ (EVMs) తయారీ, ఉత్పత్తి, రిపేర్ లేదా టెస్టింగ్‌లో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
వయస్సు: 30 సంవత్సరాలు (31 మే 2025 నాటికి). SC/ST కోసం 5 సంవత్సరాలు, OBC కోసం 3 సంవత్సరాలు, PwBD (40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం) కోసం 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
జీతం: రూ. 23,368.
అప్లికేషన్ ఫీజు: నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను ITI సర్టిఫికేట్ మార్కుల ఆధారంగా 1:4 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను హైదరాబాద్‌లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
ఒకే ITI మార్కులు ఉన్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, 10వ తరగతి మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.
ఫైనల్ మెరిట్ జాబితాను ITI మార్కులు, ట్రేడ్, కేటగిరీ ఆధారంగా తయారు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ: 7 జులై. 2025.
మరిన్ని వివరాల కోసం:
పూర్తి సమాచారంతో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కోసం.. అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ను సందర్శించండి.





