ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 200 టెక్నికల్ ఆఫీసర్ (TO-C) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక జరుగుతుంది.
ఖాళీల వివరాలు
TO-C Category 1 – 100 పోస్టులు
TO-C Category 2 – 30 పోస్టులు
TO-C Category 3 – 70 పోస్టులు
మొత్తం – 200 పోస్టులు
విద్యార్హతలు
BE / B.Tech ఉత్తీర్ణత తప్పనిసరి.
అర్హత గల విభాగాలు: ECE, ETC, EEE, Electronics లేదా సంబంధిత విభాగం
ఇప్పటికే పని చేస్తున్న అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం
రాత పరీక్ష లేదు. ఆన్‌లైన్ టెస్ట్ లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఇంటర్వ్యూ తేదీ: 24 ఫిబ్రవరి 2026
ఉదయం 9 గంటల నుంచి
ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్
నలంద కాంప్లెక్స్
ఈసీఐఎల్, హైదరాబాద్ – 500062
జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు
వయోపరిమితి: గరిష్ఠ వయస్సు – 30 ఏళ్లు, OBC – 3 ఏళ్లు, SC / ST – 5 ఏళ్లు
PwBD – 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ అప్లికేషన్. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. https://www.ecil.co.in/jobopenings
తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు
అప్లికేషన్ ఫారమ్
టెన్త్ మెమో
ఇంటర్ / డిగ్రీ సర్టిఫికెట్లు
అనుభవ సర్టిఫికెట్లు (ఉంటే)
కుల ధ్రువీకరణ పత్రం
ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు
PwBD సర్టిఫికెట్ (దివ్యాంగులకు)
ఈ లింక్‌పై క్లిక్ చేసి నేరుగా అప్లికేషన్ ఫారమ్ పొందే వీలుంది.





