HomeJOBSఐటీఐ అర్హతతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే !

ఐటీఐ అర్హతతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే !

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 కింద ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ట్రేడ్లలో కలిపి 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఇది వచ్చే నెల నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. కేవలం తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అక్టోబర్ 11 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

అప్లికేషనలు ప్రారంభం: సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.

చివరి తేదీ: అక్టోబర్ 11వ తేదీ రాత్రి 11:59 గంటలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: అక్టోబర్ 22 నుంచి 24 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

శిక్షణ ప్రారంభం: నవంబర్ 2 వ తేదీ నుంచి ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు.

ట్రేడ్స్, ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ వంటి పలు ప్రముఖ ట్రేడ్లలో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు 70 శాతం, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు 30 శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. అలాగే దివ్యాంగులకు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ వర్తిస్తుంది.

విద్యార్హత:
అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయసు వివరాలు:
అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు లభిస్తుంది. ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసిన వారు దీనికి అర్హులు కాదు.

అప్లై చేసుకునే విధానం:
ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు రెండు దశల ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా.. ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌‌షిప్ పోర్టల్ (apprenticeshipindia.gov.in)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ECIL అధికారిక వెబ్‌సైట్ (www.ecil.co.in) ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here