హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాల్లో పని చేయడానికి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 300
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 నవంబర్ 2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకి రూ.25000 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల్ని న్యూఢిల్లీలోని జోనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
చివరి తేది: 21 డిసెంబర్ 2021.
వెబ్సైట్: www.ecil.co.in
వెస్ట్ కోస్ట్ గార్డ్ రీజియన్‌లో 96 సివిలియన్ జాబ్స్
ఇండియన్ కోస్ట్ గార్డ్, వెస్టర్న్ రీజియన్ హెడ్‌కార్టర్స్ సివిలియన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 96
1) ఫైర్‌మెన్: 53
2) సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 11
3) ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 5
4) ఇంజిన్ డ్రైవర్: 5
5) సారంగ్ లస్కర్: 2
6) మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్: 5
7) లస్కర్: 5
8) స్ప్రే పెయింటర్: 1
9) మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్: 1
10) స్టోర్ కీపర్: 3
11) మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 3
12) అన్‌స్కిల్డ్ లేబర్: 2
జీతం: పోస్టుల్ని అనుసరించి వివిధ పే మ్యాట్రిక్స్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
దరఖాస్తులు: ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
వెబ్సైట్: www.indiancoastguard.gov.in