కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్’ (ECHS)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 175 మెడికల్ ఆఫీసర్, క్లర్క్, ఫార్మసిస్ట్, డ్రైవర్, ప్యూన్ తో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. జనవరి 28 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు – 175
విభాగాల వారిగా..
మెడికల్ స్పెషలిస్ట్ & గైనకాలజిస్ట్
మెడికల్ ఆఫీసర్ & డెంటల్ ఆఫీసర్
క్లర్క్, ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్
డ్రైవర్, చౌకీదార్, ప్యూన్, సఫాయీవాలా
అర్హతలు:
మెడికల్ పోస్టులకు.. సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్ లేదా డిప్లొమాతో పాటు కనీసం 3-5 ఏళ్ల అనుభవం ఉండాలి.
క్లర్క్: ఏదైనా డిగ్రీతో పాటు 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఇతర పోస్టులకు.. 8వ తరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత ట్రేడ్‌లో అనుభవం ఉండాలి.
గమనిక: మాజీ సైనికులకు (Ex-Servicemen) ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారు.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.echs.gov.in నుంచి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు యాడ్ చేయాలి.
తర్వాత పూర్తి చేసిన అప్లికేషన్‌ను 28 జనవరి 2026 లోపు “OIC, ECHS Cell, Station Headquarters, Delhi Cantt – 110010” చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం అభ్యర్థులకు ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 011-25694821 నంబర్‌ను సంప్రదించవచ్చు.





