HomeJOBSDSSSB లో 2,119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DSSSB లో 2,119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 2119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (ప్రకటన నెం. 01/2025) విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు జులై 8 నుంచి ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: జులై 8, 2025
చివరి తేదీ: ఆగస్టు 7, 2025.

ఖాళీ వివరాలు (మొత్తం 2119 పోస్టులు):
వార్డర్ (Warder – పురుషులు): 1676 పోస్టులు
మాలేరియా ఇన్‌స్పెక్టర్ (Malaria Inspector): 37 పోస్టులు
ఆయుర్వేద ఫార్మసిస్ట్ (Ayurvedic Pharmacist): 8 పోస్టులు

PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) – వివిధ సబ్జెక్టులు (ఇంగ్లీష్, సంస్కృతం, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, హార్టికల్చర్, అగ్రికల్చర్): మొత్తం 124 పోస్టులు.

డొమెస్టిక్ సైన్స్ టీచర్ (Domestic Science Teacher): 26 పోస్టులు

అసిస్టెంట్ (Assistant – వివిధ విభాగాలు): 120 పోస్టులు

టెక్నీషియన్ (Technician – వివిధ విభాగాలు): 70 పోస్టులు

ల్యాబ్ టెక్నీషియన్ (Laboratory Technician): 30 పోస్టులు

సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (Senior Scientific Assistant – కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ): 2 పోస్టులు

అర్హత :
ప్రతి పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హత ప్రమాణాలు ఉంటాయి. అభ్యర్థులు తాము అప్లై చేయాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన పూర్తి అర్హత వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలి. సాధారణంగా, 10వ తరగతి ఉత్తీర్ణత నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు ఉంటాయి.

వయస్సు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు.

గరిష్ట వయస్సు: పోస్టును బట్టి 27 నుంచి 32 సంవత్సరాల వరకు ఉంటుంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం:
ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ ప్రకారం నెలకు రూ. 19,900 నుంచి రూ. 1,51,100 వరకు లభించే అవకాశం ఉంది. పోస్టును బట్టి జీతం మారుతుంది.

అప్లికేషన్ విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

ఎలా అప్లై చేసుకోవాలంటే ?

1.ముందుగా (dsssb.delhi.gov.in )లేదా dsssbonline.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌ లోకి లాగిన్ అవ్వండి.

2.రిజిస్ట్రేషన్ (కొత్త అభ్యర్థుల కోసం): మీరు మొదటిసారి అప్లై చేస్తున్నట్లయితే, “New Registration” పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.

3.మీ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

4. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర వృత్తిపరమైన వివరాలను ఎంటర్ చేయండి.

5. మీ ఫోటోగ్రాఫ్, సంతకం, అవసరమైన ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి, నిర్దేశించిన ఫార్మాట్, సైజులో అప్‌లోడ్ చేయండి.

6. మీరు అప్లై చేయాల్సిన పోస్టులను ఎంచుకోండి.

ఫీజు చెల్లించండి:

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: ₹100/-.

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్-సర్వీస్‌మెన్, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకుఎటువంటి ఫీజు లేదు.

ఫీజును ఆన్‌లైన్ ద్వారా (క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI) చెల్లించవచ్చు.

అన్ని వివరాలను ఒకసారి సరిచూసుకున్న తర్వాత, అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here